Gold Rate: కొత్త ఏడాదిలో బంగారం కొనడం కష్టమేనా.? తులం ధర ఎంతకు చేరనుందో తెలుసా.?
Gold Price: మనదేశంలో పండగలు, శుభకార్యాలు, వివాహాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం. బంగారం అంటే మగువలకు అంత ఇష్టం.
Gold Price: మనదేశంలో పండగలు, శుభకార్యాలు, వివాహాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం. బంగారం అంటే మగువలకు అంత ఇష్టం. అంతేకాదు పెట్టుబడి సాధనంగా కూడా బంగారాన్ని ఉపయోగిస్తుంటారు. పలు కారణాల వల్ల ఈ ఏడాది బంగారం ధర దూసుకెళ్లింది. ఇక వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. భౌగోళికంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక అస్థిరత కొనసాగితే దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ. 85 వేలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే రూ.90 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ. 79,350 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా అక్టోబర్ 30న ఏకంగా రూ.82,400 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరింది. వెండి సైతం 30 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది తొలిసారి కిలో వెండి ధర రూ.1 లక్ష మార్క్ దాటి రికార్డ్ క్రియేట్ చేసింది.
దేశంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ధరలు ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటాయి. మన దేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి విలువతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. బంగారం, వెండి ధరలు నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా వీటి పెరుగుదలకు కారణమవుతున్నాయి.
గత కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరెన్సీలో హెచ్చుతగ్గులు, బంగారానికి డిమాండ్‌లో, సరఫరాలో మార్పులు ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంది. పండగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారాన్ని ఎక్కువగా కొంటుంటారు. చాలా మంది దీనిని సురక్షితమైన ఆస్తిగా చూస్తారు. ఒకానొక సమయంలో బంగారం ధర లక్షకు చేరుతుందని భావించినప్పటికీ ఇటీవల తగ్గుతూ వచ్చింది. కానీ 2025లో బంగారం ధర 90 వేలకు చేరువయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.