స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ అదే దారిలో!

Update: 2019-12-31 03:51 GMT

వారం రోజులుగా పరుగులు తీసిన బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం నాటి ధరతో పోలిస్తే 20 రూపాయలు తగ్గి  40,670 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయలు తగ్గింది.  దీంతో 37,270 రూపాయల వద్దకు చేరింది. కాగా, వెండి ధర కూడా ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 49,300 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,670 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,270 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పది గ్రాములకు 50 రూపాయలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో  ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,250 రూపాయల వద్ద చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 38,050 రూపాయలకు దిగి వచ్చింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు తగ్గిడ్ని. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ  49,300 రూపాయల వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News