స్థిరంగా బంగారం ధరలు..అదేబాటలో వెండి ధరలు..

Update: 2019-12-26 03:00 GMT

రెండు రోజులుగా  భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా మార్పులు లేకుండా ఉన్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,960 రూపాయల వద్దస్థిరంగా ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 36,650 రూపాయల వద్దే నిలిచింది. కాగా, వెండి ధర లలో కూడా మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,300 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,960 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,650 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా 38,650 రూపాయల వద్ద ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా  37,450 రూపాయలవద్ద స్థిరంగా నిలిచింది. ఇక వెండి ధర  కేజీకి 47,300 రూపాయల వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News