Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా పెరుగుతున్న ధర రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించినట్లయ్యింది. కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. నేడు మార్చి 31వ తేదీ సోమవారం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81,593 ఉంది. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89,010 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 81,730 ఉంది. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89,160కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 81,868గా ఉంది. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89, 310గా ఉంది. అయితే ఇటీవల రూ.90వేల మార్కును దాటింది బంగరాం ధర. అక్కడి నుంచి కాస్త తగ్గుముఖం పట్టడం పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
ఇక వెండి ధరలు చూస్తే దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర రూ. 1,00,410గా ఉంది. ముంబైలో రూ. 100,590వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,00,740కి చేరింది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
బెంగళూరు- రూ.81,794, రూ.89,230
పుణె- రూ.81,730, రూ.89,160
అహ్మదాబాద్- రూ.81,840, రూ.89,280
భువనేశ్వర్- రూ.81,758, రూ.89,190
భోపాల్- రూ.81,822, రూ.89,260
కోల్‌కతా- రూ.81,629, రూ.89,050
చెన్నై- రూ.81,968, రూ.89,420