Gold Rate: కొద్దిగా దిగి వచ్చిన బంగారం ధరలు..వెండి ధరలు మాత్రం పై పైకే!

Gold Rate: ఈరోజు బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-29 01:35 GMT

రెండు రోజులుగా పైకెగసిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (29.10.2020) కొద్దిగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు కొద్దిగా పైకెగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (29.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయలు తగ్గి 47,730 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు తరుగుదల నమోదు చేసింది. దీంతో 52,060 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు మాత్రం ఈరోజు కొద్దిగా పైకెగశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 300 రూపాయలు పెరిగింది. దీంతో 62వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,400 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. గురువారం (29.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయలు తగ్గి 47,730 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు తరుగుదల నమోదు చేసింది. దీంతో 52,060 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా కిందికి దిగివచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధర కంటె 100 రూపాయలు తగ్గింది. దీంతో 49,500 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ప్రారంభ ధర కంటె 100 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 53,200 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధారల విషయానికి వస్తే, కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 300 రూపాయలు పెరిగింది. దీంతో 62వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,400 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.   

Tags:    

Similar News