బంగారం ధరలు కాస్త తగ్గాయి.. వెండి కూడా అదే దారిలో!

ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్ లో కాస్త తగ్గాయి. కానీ, డిల్లీ మార్కెట్ లో మాత్రం భారీగా పెరిగాయి.

Update: 2020-04-29 01:30 GMT
gold rate today

ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మిశ్రమంగా కదిలాయి. దాదాపుగా పెరుగుదల బాటలోనే ఉన్నా హైదరాబాద్లో మాత్రం 22 క్యారెట్ల బంగారం ధర కాస్తంత తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం కొంత పెరిగింది. ఈరోజు (ఏప్రిల్ 29) బంగారం ధరలు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబద్ లో కాస్త తగ్గినట్టు కనిపించినా డిల్లీ మార్కెట్లో మాత్రం పై చూపులే చూశాయి. మరో వైపు నిన్న కాస్త కిందకి దిగిన వెండి ధరలు ఈరోజు మరింత తగ్గాయి. కేజీకి 700 రూపాయల తగ్గుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు మిశ్రమంగా కదిలాయి. బుధవారం (29.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 500 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,240 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం పది గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో 47,000 రూపాయలు నమోదు చేసింది.

కాస్త తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కేజీకి 700 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే కిందికి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,500 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం ధర కంటే 500 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,540 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో 47,000 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,500 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు పెరుగుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయల పెరుగుదలతో 48,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయల పెరుగుదలతో 46,150 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 41,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News