Gold Rate: స్థిరంగా బంగారం ధరలు.. మార్పులు లేని వెండి ధరలు!

Gold Rate: నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బంగారం ధరలు మార్పులు లేవు. ఇక వెండి ధరలు కూడా నిన్నటి ధరల వద్దే నిలిచాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-26 02:24 GMT

బంగారం ధరలు శుక్రవారం మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో శనివారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (26.12.2020) మార్పులు లేవు. మరో వైపు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. శనివారం (26.12.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 46,700 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చి 50,940 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు స్థిరంగా..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర వద్దే మార్పులు లేకుండా నిలిచింది. దీంతో 71 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,400 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. శనివారం (26.12.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 46,700 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చి 50,940 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర 48,760 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే కదలిక లేకుండా 53,190 రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర వద్ద నిలకడగా ఉండి 66 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,600 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News