gold rate : శుభవార్త..భారీగా తగ్గిన బంగారం. వెండి ధరలూ కిందికే!

Update: 2020-03-20 02:55 GMT

బంగారం ధరలు అటూ ఇటూ కదులుతూ వస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు అంతకు మించి కిందకు దిగోచ్చాయి. భారీ తగ్గుదలను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు పదకొండు వందల రూపాయల  వరకూ తగ్గుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర భారీ పతనాన్ని చూసింది. ఏకంగా కేజీ వెండి 17 వందలకు పైగా దిగొచ్చింది.

హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (20.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 1050 రూపాయల తగ్గుదల నమోదు చేసి 38,340 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 1050 రూపాయల తగ్గుదలతో 41,920 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. రికార్డు స్థాయిలో కేజీ వెండి ధర ఒక్కసారిగా 1790 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర  39,990 రూపాయల వద్దకు పడిపోయింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 1050 రూపాయల తగ్గుదల నమోదు చేసి 38,34 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1050 రూపాయల తగ్గుదలతో 41,920 రూపాయలు నమోదు చేసింది. ఇక  వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పడిపోయాయి. 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 39,990 రూపాయల వద్దకు పడిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భగ్గు మన్నాయిభారీగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1100 రూపాయల తగ్గుదలతో 40,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1100 రూపాయల తగ్గుదలతో 39,150 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పడిపోయాయి. 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 39,990 రూపాయల వద్దకు పడిపోయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-03-2020 ఉదయం 8 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News