Gold Rate: పసిడి పరుగులు.. వెండి ధరల మోత!

Gold Rate: రెండో రోజూ బంగారం ధరలు పైకి కదిలాయి. ఈరోజు బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు మళ్ళీ భారీగా పైకెగశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-19 02:18 GMT

బంగారం ధరలు శుక్రవారం కొద్దిగా పెరుగుదల నమోదు చేసాయి. దీంతో శనివారం మార్కెట్లు పెరుగుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (19.12.2020) కొద్దిగా పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (19.12.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కంటే 400 రూపాయల పెరుగుదల నమోదుచేసింది. దీంతో 46,800 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 450 రూపాయల పెరుగుదల నమోదు చేయడంతో 51 వేలరూపాయల మార్క్ దాటింది. దీంతో 51,050 రూపాయలుగా ఉంది..

వెండి ధరలు భారీ పెరుగుదల..

బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల నమోదు చేస్తే.. వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 900 రూపాయలు పెరిగాయి. దీంతో 71 వేల రూపాయల స్థాయికి పెరిగిపోయింది. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,500 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కంటే 400 రూపాయల పెరుగుదల నమోదుచేసింది. దీంతో 46,800 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 450 రూపాయల పెరుగుదల నమోదు చేయడంతో 51 వేలరూపాయల మార్క్ దాటింది. దీంతో 51,050 రూపాయలుగా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటే 190 రూపాయల పెరుగుదల నమోదుచేసింది. దీంతో 48,950 రూపాయల వద్దకు చేరుకున్నాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటే 440 రూపాయల పెరుగుదల నమోదుచేసింది 53,440 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ కూడా వెండి ధరలు పెరుగుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 700 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 67 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,700 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News