Gold Rate: స్థిరంగా బంగారం ధరలు..వెండి ధరలు పై పైకి!

Gold Rate: భారీ తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పైకి కదిలాయి. వెండి ధరలు కూడా పైకే కదిలాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-11-13 01:27 GMT

బంగారం ధరలు ఈరోజు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో స్థిరంగా ఉన్న బనారం ధరలు ఢిల్లీ లో మాత్రం పైకెగాశాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరల వద్దే మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. బంగారం ధరలు ఈరోజు (13.11.2020) స్థిరంగా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం కొద్దిపాటి పెరుగుదల బాటలోనే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. శుక్రవారం (13.11.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 47,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు కదలిక లేకుండా 51,490 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె, వెండి ధరలు మాత్రం ఈరోజు మళ్ళీ పైకెగాశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 500 రూపాయలు పెరిగింది. దీంతో 63 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 63,300 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. శుక్రవారం (13.11.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 47,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు కదలిక లేకుండా 51,490 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు అత్యంత స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 90 రూపాయలు పెరిగింది. దీంతో 49,250 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 53,620 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు ఈరోజు కొద్దిగా కిందికి దిగొచ్చాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 100 రూపాయలు తగ్గింది. దీంతో 62 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,700 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News