Gold Rate Today: ఆల్ టైం రికార్డ్.. మోత మోగించిన బంగారం.. ఇప్పుడు ఎంతో తెలుసా?

Update: 2020-03-05 01:20 GMT

అలాగా..ఇలాగ కాదు ఒక్కసారే రివ్వున దూసుకుపోయాయి బంగారం ధరలు. వెండి ధరలు కూడా అదే దారిలో రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. కరోనా ఎఫెక్ట్ మనిషి ఆరోగ్యానికే కాదు.. ఆర్ధిక అంశాలలో కూడా తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. ఒక్కరోజులోనే బంగారం ఈ స్థాయిలో పెరగడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒకే రోజులో 1500 రూపయల మేర పది గ్రాముల బంగారం పెరిగింది. ఒక పక్క అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు.. మరో పక్క రూపాయి పతనం బంగారం ధరలను శాసించాయి. దీంతో సామాన్యునికి అందనంత  ఎత్తుకు బంగారం దూసుకుపోతోంది.

బంగారం ధరలు మళ్ళీ పై చూపులు చూశాయి. వరుసగా మూడోరోజు  రోజూ బంగారం ధరలు అతి భారీ  పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు అదే దారిలో భారీ మోత మోగించాయి. దేశీయంగా ఈరోజు (05.03.2020) బంగారం ధర పైకెగసింది. రెండవ రోజూ భారీ  పెరుగుదల నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1520 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,790 రూపాయల నుంచి 45,310 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 1390 రూపాయలు పెరిగింది. దీంతో 40,140 రూపాయల నుంచి 41,530 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పైకెగసింది.

భారీగా పెరిగిన వెండి!

బంగారం ధర పెరిగితే వెండి ధరలు కూడా భారీ స్థాయిలో మోత మోగించాయి. దీంతో గురువారం వెండి ధరలు భారీ గా పెరిగాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 1330 రూపాయలు పెరిగి  48,70 రూపాయల నుంచి 50,030 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 45,310 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 41,530
 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 1330 రూపాయలు పెరిగాయి. దీంతో కెజీ వెండి 50,030 రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి.దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1400 రూపాయలు పెరిగి 43,600 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1400 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 42,400 రూపాయల వద్దకు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా మోత మోగించి 50,030 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News