Gold Rate Today: దిగివస్తున్న బంగారం ధరలు.. పడిపోయిన వెండి ధరలు!

Update: 2020-02-05 01:57 GMT

కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న కాస్త దిగొచ్చాయి. ఈరోజు కూడా అదేస్థాయిలో బంగారం కింది చూపులు చూసింది. నిన్నటి ధరల కంటే ఈరోజు (05.02.2020) స్వల్పంగా బంగారం ధర తగ్గింది.

దిగివచ్చిన బంగారం..

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 220 రూపాయలు తగ్గింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,670 నుంచి 42,450 రూపాయలకు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 240 రూపాయలు తగ్గడంతో 39,110 నుంచి 38,770 రూపాయల వద్దకు చేరుకుంది.

భారీగా పడిపోయిన వెండి ధరలు..

ఒకవైపు బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేయగా, వెండి ధరలు రెండోరోజూ భారీగా పతనమయ్యాయి. వెండి ధరలు కేజీకి 500 రూపాయలు దిగొచ్చాయి. దీంతో వెండి ధరలు కేజీకి 48,500 రూపాయల వద్దనిలిచాయి. విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,450 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,770 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 48,500 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 350 రూపాయలుతగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,800 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 350 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,600 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 48,500 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును. 

Tags:    

Similar News