Gold Rate: బంగారం ధరలు దిగివస్తూనే ఉన్నాయి.. వెండి ధరలు కూడా కిందికి!

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గుదల బాటలోనే నడిచాయి. వెండి ధరలు కూడా బంగారం ధరల దారిలోనే నడిచాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-01 03:00 GMT
Gold Rate today

బంగారం ధరలు ఈరోజు కూడా కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కిందికి దిగొచ్చాయి.. బంగారం ధరలు ఈరోజు (01.12.2020)కూడా కింది చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీస్థాయిలో తగ్గుదల కనబరిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజూ కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (01.12.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,700 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 336 రూపాయలు కిందికి కదిలింది. దీంతో 48,764 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి..

బంగారం ధరలు కాస్త కిందికి కదిలితే, మరోవైపు వెండి ధరలు కూడా కింది చూపులు చూశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 1400 రూపాయలు తగ్గుదల కనబరిచాయి. దీంతో 63 వేలరూపాయల స్థాయికి దిగివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 63,300 రూపాయల వద్ద స్థిరంగా ఉన్నాయి.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. మంగళవారం (01.12.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,700 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 336 రూపాయలు కిందికి కదిలింది. దీంతో 48,764 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శసోమవారం నాటి ప్రారంభ ధర కంటె 310 రూపాయలు తగ్గింది. దీంతో 46,850 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 350 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 51,100 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 900 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 58 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 58,300 రూపాయల వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News