Gold And Silver Rates Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..తులంపై ఎంత తగ్గిందంటే?

Update: 2024-11-26 01:25 GMT

Gold Rate Today: సెప్టెంబర్ 25 బుధవారం నేటి బంగారం ధరలు..70వేలు దాటిన పసిడి ధర

 Gold And Silver Rates Today: దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో బంగారం తులం ధర రూ. 1000 క్షీణించింది. రూ. 79,400కు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో చూద్దాం.

దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూశాయి. దేశ రాజధానిలో తులం బంగారం ధర మంగళవారం రూ. 1000 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 79,400కు చేరుకుంది. 99.5 శాతం స్వచ్చత గల బంగారం ధర తుతం రూ. 100 తగ్గింది. 79,000కు చేరింది., మరోవైపు కిలో వెండి ధర రూ. 1600 తగ్గింది. రూ. 91,700చేరింది.

శుక్రవారం తులం బంగారం ధర రూ. 80,400 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ. 93,300 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో డిసెంబర్ డెలివరీ బంగారం తులం ధర రూ. 1071 తగ్గడంతో రూ. 76, 545కు చేరుకుంది.

కిలో వెండి ధర డిసెంబర్ డెలివరీ ధర రూ. 1,468 పతనమైంది. రూ. 89, 300 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ప్యూచర్స్ లో ఔన్స్ పసిడి ధర రూ. 40, 80 డాలర్లు పతనమవ్వగా 2696. 40 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి ధర 1.7శాతం తగ్గి 31.24 డాలర్లకు చేరుకుంది.

Tags:    

Similar News