Credit Card Bills: క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలో చిక్కుకున్నారా? ఈ చిట్కాలతో బయటపడండిలా..!

Credit Card Bills: నేటి డిజిటలైజేషన్ యుగంలో చాలా మంది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం చాలా సాధారణమైంది.

Update: 2022-01-12 10:18 GMT

Credit Card Bills: క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలో చిక్కుకున్నారా? ఈ చిట్కాలతో బయటపడండిలా..!

Credit Card Bills: నేటి డిజిటలైజేషన్ యుగంలో చాలా మంది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం చాలా సాధారణమైంది. వీటితో బిల్లుల చెల్లింపులు సులువుగా పూర్తవ్వడంతోపాటు ఈ కార్డులపై అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ కారణంగా ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ కార్డుల బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. దీనివల్ల మీరు అప్పుల ఊబిలో చిక్కుకపోయే అవకాశం ఉంది.

కొంతమంది నిండా మునిగిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొవడం మనం చూసే ఉంటాం. వీటి నుంచి బయటపడడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు చక్రవడ్డీని వసూలు చేస్తాయని గమనించాలి. దీంతో ఈ సుడిగుండంలో నుంచి బయటపడటం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు చిక్కుకున్నట్లయితే, ఈ చిట్కాలను అనుసరించి, వాటి నుంచి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం..

మీ బకాయి బిల్లును EMIగా మార్చుకోండి..

క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ బకాయి బిల్లులను EMIగా మార్చుకోవచ్చు. దీనితో, మీరు ప్రతి నెలా చిన్న మొత్తాలను చెల్లించవలసి ఉంటుంది. దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన భారం నుంచి బయటపడొచ్చు. మీ చెల్లింపు సామర్థ్యం ప్రకారం మీ బిల్లును EMIగా మార్చుకుని, క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించవచ్చు. అయితే మీ సామర్థ్యాన్ని బట్టి డబ్బు తిరిగి చెల్లించాలని మాత్రం గుర్తుంచుకోండి. ఎంత వరకు చెల్లిస్తారో, అన్ని నెలల వరకు ఈఎంఐ కాలాన్ని ఎంచుకుని ఈ బాధల నుంచి బయటపడొచ్చు.

బ్యాలెన్స్‌ని మరొక బ్యాంక్‌కి బదిలీ చేయండి..

ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్‌లు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తుందని మీరు భావిస్తే, మీ బిల్లు లేదా EMIని మరొక బ్యాంక్ లేదా క్రెడిట్‌కి బదిలీ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను బదిలీ చేయడం ద్వారా, మీరు తక్కువ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది.

తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకోండి..

క్రెడిట్ కార్డ్‌పై మీకు సంవత్సరానికి 40 శాతం మేర వడ్డీని వసూలు చేస్తుందని గుర్తుంచుకోండి. మీరు పర్సనల్ లోన్ వడ్డీ రేటుతో పోల్చితే.. క్రెడిట్ కార్డు వడ్డీరేటు చాలా ఎక్కువ. పర్సనల్‌లోన్‌పై మీకు 11 శాతం వరకు మాత్రమే వడ్డీరేటు వేస్తారు. పర్సనల్‌ వడ్డీరేటు చౌకగా లభించడంతో మీ భారాన్ని తగ్గించుకోవచ్చు. పర్సనల్ లోన్ తీసుకున్నాక ముందుగా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించండి. ఆతర్వాత మీ సౌలభ్యం ప్రకారం పర్సనల్ లోన్‌ను తిరిగి చెల్లిస్తూ ఉండండి.

Tags:    

Similar News