Oldest Railway Station: ప్రపంచంలోని పురాతన రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా? 193 సంవత్సరాలుగా చెక్కు చెదరలే..!

Oldest Railway Station: రైలులో ప్రయాణించడం అనేది చాలా సరదాగా ఉంటుంది.

Update: 2023-07-31 16:00 GMT

Oldest Railway Station: ప్రపంచంలోని పురాతన రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా? 193 సంవత్సరాలుగా చెక్కు చెదరలే..!

Oldest Railway Station: రైలులో ప్రయాణించడం అనేది చాలా సరదాగా ఉంటుంది. కిటికీ దగ్గర కూర్చొని, సరస్సులు, నదులు, అడవులు చూస్తూ ప్రయాణం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. రైల్వేకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను మీరు తరచుగా వినే ఉంటారు. పొడవైన రైలు, చిన్న రైలు, మొదటి రైలు మొదలైనవి. అయితే, ప్రపంచంలోని పురాతన రైల్వే స్టేషన్ ఏది అనేది తెలుసుకోవడం కూడా మీకు చాలా ముఖ్యం. ఓ స్టేషన్ 193 సంవత్సరాల కంటే పాతది.

నేడు ప్రపంచంలో దాదాపు ప్రతిచోటా రైల్వే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మనం దేశంలోని పురాతన రైల్వే స్టేషన్ గురించి మాట్లాడినతే, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్షన్ భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్. ఇది 1852 సంవత్సరంలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ చారిత్రాత్మకమైనది. అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పురాతన రైల్వే స్టేషన్‌ గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలోని పురాతన రైల్వే స్టేషన్ - లివర్‌పూల్ రోడ్ స్టేషన్..

లివర్‌పూల్ రోడ్ స్టేషన్ 15 సెప్టెంబర్ 1830న ప్రారంభించారు. దీని కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన రైల్వే స్టేషన్‌గా మిగిలిపోయింది. అసలు విషయం ఏమిటంటే, స్టేషన్ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. కానీ, ఈ స్టేషన్ ఆపరేషన్ 1975 నుంచి నిలిపేశారు. లివర్‌పూల్ రోడ్ స్టేషన్ లివర్‌పూల్, మాంచెస్టర్ రైల్వేలో భాగంగా నిర్మించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవిరితో నడిచే ఇంటర్-అర్బన్ రైల్వే. నేడు, లివర్‌పూల్ రోడ్ స్టేషన్ భవనం మాంచెస్టర్‌లోని మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీలో భాగంగా ఉంది.

బ్రాడ్ గ్రీన్ రైల్వే స్టేషన్..

రెండవ పురాతన స్టేషన్ గురించి మాట్లాడినట్లయితే, అది బ్రాడ్ గ్రీన్ రైల్వే స్టేషన్. ఇది సెప్టెంబర్ 15, 1830న ఓపెన్ చేశారు. ఈ స్టేషన్ 1830 నుంచి నిరంతరం పనిచేస్తుంది. దీని భవనం మునుపటిలా లేనప్పటికీ, 1970లలో చాలా మార్పులు చేశారు. ప్రజల కోసం ఎక్కువ కాలం పని చేయడం వల్ల ఈ స్టేషన్ ప్రపంచంలోనే పురాతన రైల్వే స్టేషన్‌గా మారింది.

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్..

మరోవైపు, మనం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గురించి మాట్లాడితే, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇది 1903 నుంచి 1913 సంవత్సరాల మధ్య నిర్మించారు. ప్రపంచంలోనే ఈ అతిపెద్ద రైల్వే స్టేషన్‌లో 44 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

Tags:    

Similar News