Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!
Term Insurance: ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
Term Insurance: ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్సూరెన్స్ అనేది కుటుంబానికి అండగా నిలుస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమా పాలసీలో ఒక భాగం, ఇది మరణం సంభవించినప్పుడు పాలసీదారుని కుటుంబానికి పెద్ద బీమా రక్షణను అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.
టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు మీ కుటుంబ అవసరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం అవసరం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని టర్మ్ బీమాను కొనుగోలు చేయండి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, టర్మ్ ఇన్సూరెన్స్ మీ వార్షిక ఆదాయానికి కనీసం 9 నుంచి 10 రెట్లు ఉండాలి.
మీ వయస్సు, ఆర్థిక బాధ్యతలు, కుటుంబ పరిస్థితులు మొదలైన వాటి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ముందు అవసరమైన లైఫ్ కవర్ మొత్తాన్ని ఎంచుకోవాలి.
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది అనారోగ్యం గురించి సమాచారం ఇవ్వరు. ఇలాంటి తప్పు అస్సలు చేయకండి. ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా ఆ విషయం బీమా కంపెనీకి తెలియజేయండి. దీని వల్ల క్లెయిమ్ తీసుకునేటప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.
మీ ప్రస్తుత వయస్సుతో సంబంధం లేకుండా, కనీసం 60 ఏళ్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి. ఈ రోజుల్లో, మీకు 85 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడా కవర్లు ఉన్నాయి.