కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం.. వారికి ఎటువంటి హామి లేకుండా రుణాలు..

Credit Guarantee Scheme: దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (CGSS)ని ఆమోదించింది.

Update: 2022-10-11 05:27 GMT

కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం.. వారికి ఎటువంటి హామి లేకుండా రుణాలు..

Credit Guarantee Scheme: దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (CGSS)ని ఆమోదించింది. ఈ పథకం కింద స్టార్టప్ కంపెనీలకు ఎలాంటి హామీ లేకుండా రూ.10 కోట్ల వరకు రుణాలు మంజూరుచేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబరు 6న లేదా ఆ తర్వాత మంజూరైన రుణాలు ఈ పథకం కిందికి వస్తాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకం కింద స్టార్టప్ కంపెనీలకి నిర్ణీత కాలానికి రుణాలు మంజూరుచేస్తారు.

అయితే స్టార్టప్ కంపెనీలకు మాత్రమే క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద రుణాలు లభిస్తాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల దేశంలోని స్టార్టప్ కంపెనీలకు మూలధనాన్ని సేకరించడానికి సహాయపడుతుంది. ఈ పథకం కోసం భారత ప్రభుత్వం ఒక ట్రస్ట్ లేదా నిధిని ఏర్పాటు చేస్తుంది. ఈ ట్రస్ట్ రుణానికి హామీగా పనిచేస్తుంది. ఇది నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ బోర్డుచే నడుస్తుంది. స్టార్టప్‌కు ఇచ్చిన రుణం డిఫాల్ట్ అయిన సందర్భంలో రుణం ఇచ్చే బ్యాంకుకు హామీ ఇవ్వడం ట్రస్ట్ బాధ్యత.

సరైన రుణగ్రహీతలకు ఇచ్చిన రుణం డిఫాల్ట్ అయిన సందర్భంలో చెల్లింపుకు హామీ ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీని కోసం స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించే స్టార్టప్‌లు మాత్రమే అర్హత పొందుతాయి. లోన్ పొందడానికి స్టార్టప్ నెలవారీ స్టేట్‌మెంట్ గత 12 నెలలుగా ఆడిట్ చేస్తారు. అలాగే స్టార్టప్‌లు ఎటువంటి రుణంలో డిఫాల్ట్ చేయకుండా ఉండాలి. ఇది కాకుండా ఆ కంపెనీని ఆర్‌బిఐ ఎన్‌పిఎ జాబితాలో చేర్చకూడదు. గత కొన్ని సంవత్సరాలుగా స్టార్టప్‌లకు ప్రభుత్వం నుంచి చాలా సహాయం అందుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News