ITR Filing 2024: ITR ఫైలింగ్ గడువు పొడిగింపు..కేంద్రం కీలక ప్రకటన

ITR Filing 2024: మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేయలేదా?గడువు ముంచుకొస్తుంది. జులై 31 చివరి తేదీ. ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏం చెప్పిందో తెలుసుకుందాం.

Update: 2024-07-23 02:45 GMT

ITR Filing 2024: ITR ఫైలింగ్ గడువు పొడిగింపు..కేంద్రం కీలక ప్రకటన


ITR Filing 2024: ఐటీఆర్ గడువు జులై 31. ఈ తేదీని పొడిగించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది నిజమే అనుకున్న చాలా మంది జులై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయకున్నా ఏం జరుగదనుకుంటున్నారు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జులై 31 వరకు ఫ్రీగా ఫైలింగ్ చేసే అవకాశం ఉందని..ఆ తర్వాత ఫైన్ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.

సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకూడదని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ వెల్లడింది. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఓ ట్వీట్ కూడా చేసింది. ఐటీఆర్ ఇ ఫైలింగ్ తేదీ పొడిగించినట్లుగా @sandeshnews క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మా ద్రుష్టికి వచ్చింది. ఇది ఫేక్ న్యూస్. @IncomeTaxIndia అధికారిక వెబ్ సైట్లో వచ్చిన అప్ డేట్స్ ను మాత్రమే నమ్మాలంటూ సూచించింది.

కాగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ 2024కి చివరి తేదీ జులై 31 కాగా ఆ తర్వాత చెల్లిస్తే ఫైన్ పడుతుంది. దీంతో ప్రతిఒక్కరూ జులై 31వ తేదీ లోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయడం బెటర్. ఇలా గడువులోపు చెల్లిస్తేనే రిఫండ్స్ కూడా త్వరగా వస్తాయి. గడువులోపు ఫైల్ చేయకుంటే చెల్లించే పన్నుపై సెక్షన్ 234A కింద 1 శాతం వడ్డీ చెల్లించాల్సిందే. 



Tags:    

Similar News