Gold Rate Today: తగ్గినట్లే తగ్గి సడెన్ షాకిచ్చిన బంగారం ధర..భారీగా పెరిగిన పసిడి ధర..ఎంతంటే?

Gold Rate Today: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 350 రూపాయలు పెరిగింది. అక్టోబర్ 17 గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,840 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,100 రూపాయలు పలికింది.

Update: 2024-10-17 02:40 GMT

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే...తులం బంగారం ఎంతంటే..?

Gold Rate Today: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 350 రూపాయలు పెరిగింది. అక్టోబర్ 17 గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,840 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,100 రూపాయలు పలికింది.

బంగారం ధరలు అంతర్జాతీయంగా కూడా పెరుగుతున్నాయి. అయితే దేశీయంగా కూడా డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు సరికొత్త రికార్డును మళ్ళీ సృష్టించాయి. బంగారం ధరలు ఈ స్థాయి నుంచి ఎంత పెరిగినా ప్రతిరోజు ఒక రికార్డు అవుతుంది. ఎందుకంటే బంగారం ధరలు సరికొత్త హై ధర వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

బంగారం ధరలు పెరగడానికి అటు దేశీయ కారణాలతో పాటు అంతర్జాతీయ కారణాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా డాలర్ ధర పతనం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోలు చేసేందుకు అన్ని దేశాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా బంగారాన్ని ఎడాపెడా కొనేస్తోంది.

దీంతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కూడా కారణంగా చెప్పవచ్చు. భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా ఉంచుకునేందుకు బంగారం వరకు తరలిస్తుంటారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సుకు గానూ 2700 డాలర్లు ఎగువన ట్రేడ్ అవుతోంది.

గత ఏడాదితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర ఏకంగా 13 వేల రూపాయలు పెరిగింది. గత సంవత్సరం బంగారం ధర ఈ నెలలో సుమారు 65 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అయింది. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు నాణ్యత విషయంలో బరువు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాకూడదని ఇప్పుడు నన్ను సూచిస్తున్నారు.

Tags:    

Similar News