Hyundai IPO: నేడు బాహుబలి ఐపీఓ ప్రారంభం..సబ్‌స్క్రిప్షన్‌ చేసే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

Hyundai IPO: దేశంలో అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధం అయ్యింది. దక్షిణ కొరియాకు చెందని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ నేడు ప్రారంభం కానుంది.

Update: 2024-10-15 03:18 GMT

 Hyundai IPO: నేడు బాహుబలి ఐపీఓ ప్రారంభం..సబ్‌స్క్రిప్షన్‌ చేసే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

Hyundai IPO: దేశంలో అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధం అయ్యింది. దక్షిణ కొరియాకు చెందని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ నేడు ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ. 1865-1960 వరకు ఉండనుంది. ఇప్పటి వరకు ఎల్ఐసీనే అతిపెద్ద ఐపీఓగా ఉంది. అయితే ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ దాన్ని అధిగమించే అవకాశం ఉంది. గరిష్ట ధరల శ్రేణి వద్ద రూ. 27,870 కోట్లు సమీకరించేందుకు హ్యుందాయ్ డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఐపీఓకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ: 

హ్యుందాయ్ మోటార్ ఇండియా IPO ఈ రోజు అంటే అక్టోబర్ 15 న ప్రారంభం అవుతుంది. ఈ IPO అక్టోబర్ 17 న ముగుస్తుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా IPO భారతదేశ చరిత్రలో అతిపెద్ద IPO అవుతుంది. ఈ ఆటోమొబైల్ కంపెనీ తన IPO నుండి మొత్తం 27,870.16 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ IPO పూర్తిగా OFS ఆధారితమైనది. ఇందులో కంపెనీ ప్రమోటర్లు మొత్తం 14,21,94,700 షేర్లను కేటాయిస్తారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా తన IPO కింద ఒక్కో షేరుకు రూ.1865 నుంచి రూ.1960 ధరను నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒకే లాట్‌లో 7 షేర్లు ఉంటాయి. 7 షేర్లలో ఒక లాట్ కోసం, రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.13,720 పెట్టుబడి పెట్టాలి.

కంపెనీ షేర్లు అక్టోబరు 22న బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో లిస్ట్ కానున్నాయి:

అక్టోబర్ 17న ఐపీఓ ముగిసిన తర్వాత, శుక్రవారం, అక్టోబర్ 18న షేర్ల కేటాయింపు జరుగుతుంది. వచ్చే వారం, అక్టోబర్ 21, సోమవారం, షేర్లు పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలకు జమ అవుతాయి. చివరికి అక్టోబర్ 22, మంగళవారం, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ భారతీయ స్టాక్ మార్కెట్, BSE, NSE ప్రధాన ఎక్స్ఛేంజీలలో జాబితా అవుతుంది. హ్యుందాయ్ ప్రధాన ప్రత్యర్థి కంపెనీలు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా ఇప్పటికే స్టాక్ మార్కెట్‌లో జాబితా లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.

కాగా గ్రే మార్కెట్​లో ఉన్న ప్రీమియంను పరిగణనలోకి తీసుకున్నట్లయితే.. హ్యుందాయ్ మోటార్ షేర్ల విలువ పెరిగే ఛాన్స్ ఉంది. 

Tags:    

Similar News