Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అక్టోబర్ 18, శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,820 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,160 పలుకుతోంది.

Update: 2024-10-18 02:45 GMT

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

 

Gold Rate Today: బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అక్టోబర్ 18, శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,820 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,160 పలుకుతోంది. పసిడి ధరలు సరికొత్త రికార్డుల దిశగా పరిగెడుతున్నాయి.

బంగారం ధర ఇక్కడ నుంచి ఎంత పెరిగిన కొత్త రికార్డు అవుతుంది. బంగారం ధర గడిచిన మూడు నెలల్లో ఏకంగా 13 వేల రూపాయలు పెరిగింది. జూలై నెలలో బంగారం ధర చివరిసారిగా 67 వేల రూపాయల వద్దకు కనిష్ట స్థాయిని తాకింది. అక్కడి నుంచి బంగారం ధర వరుసగా పెరుగుతూ ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు.

బంగారం ధరలు ప్రధానంగా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కారణంగా వరుసగా పెరుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్యం ఈ యుద్ధ వాతావరణం వల్ల దెబ్బ తింటుందని మదుపుదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే ప్రసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తారో వారికి ఇది ఈ ధరలు కాస్త ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు.

ఎందుకంటే ఆభరణాల ధరలు అమాంతం పెరుగుతాయి. దీనికి తోడు ఈ నెల చివరలో ధన త్రయోదశి పండుగ ఉంది. ఈ పండగ సందర్భంగా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అప్పటివరకు వేచి చూద్దాము అనే వారికి నిపుణులు చేదు వార్తలు వినిపిస్తున్నారు. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, అతి త్వరలోనే బంగారం ధర తులం ఒక లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.

Tags:    

Similar News