Gold Rate Today: భారీగా పతనమైన బంగారం ధర..ఎంత తగ్గిందంటే..?

Gold Rate Today: బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 300 రూపాయలు తగ్గింది. అక్టోబర్ 15 మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,833 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,363 పలికింది.

Update: 2024-10-15 02:31 GMT

గత వారం రోజులుగా బంగారం ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ప్రియులు బంగారం కొనుగోలు చేసేందుకు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే గడచిన 3 నెలల్లో చూసినట్లయితే బంగారం ధర దాదాపు జూలై చివరి వారంలో బంగారం ధర 67 వేల రూపాయలు మాత్రమే ఉంది.

బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కానీ అక్కడ నుంచి వేగంగా బంగారం ధర పుంజుకొని నేడు ఏకంగా 78 వేల రూపాయల ఎగువన రికార్డు ధరను నమోదు చేశాయి. ప్రస్తుతం రికార్డు ధర సమీపంలో బంగారం ధర ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది.

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం పొంచి ఉంది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పసిడి ధరలు భారీగా పెరిగినట్లు అయితే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇబ్బందులు తలెత్తుతాయి.

అయితే పసిడి ధరలు భవిష్యత్తులో కొంచెం కరెక్షన్‎కు లోనయ్యే ఉందని స్వల్పంగా హెచ్చుతగ్గులకు గురవుతుందని సూచిస్తున్నారు. అయితే ఇది స్వల్పకాలికమే గాని దీర్ఘకాలికంగా కాదని చెప్తున్నారు. ఇక బంగారంలో పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలి అనుకునేవారు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిదని సూచిస్తున్నారు.

Tags:    

Similar News