Crocodile: ఈ దేశంలో మొసలిని కైమా చేసి లొట్టలేసుకుంటూ తినేస్తారు..రక్తం అమ్మేస్తారు.. ఇదెక్కడి వింత టేస్టు రా బాబు

Crocodile: ఆ దేశంలో మొసళ్లను తినడం సంప్రదాయం అట. అక్కడి ప్రజలు స్వయంగా మొసలిని వేటాడి దాని మాంసం, రక్తం, చర్మాన్ని పలు ఉత్పత్తులో ఉపయోగిస్తారట. ఇంతకీ ఎక్కడో తెలుసా?

Update: 2024-10-16 05:38 GMT

Crocodile: ఈ దేశంలో మొసలిని కైమా చేసి లొట్టలేసుకుంటూ తినేస్తారు..రక్తం అమ్మేస్తారు.. ఇదెక్కడి వింత టేస్టు రా బాబు

Crocodile: ఒక్కో దేశంలో ఒక్కోరకమైన ఆహారం తింటుంటారు. మనదేశంలో ఎక్కువగా నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్, ఫిష్ వంటివి తింటారు. కొన్ని దేశాల్లో పాములు, కప్పలు, సమస్తం తింటారు. రెస్టారెంట్లలో జీవించి ఉన్న పాములను కూడా ప్రదర్శనలో ఉంచుతారు. చైనాలో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ మొసళ్లను తింటారని మీకు తెలుసా. అంతేకాదు దాని రక్తంలో బిజినెస్ చేస్తారట. ఆ దేశంలో మొసళ్లను తినడం సంప్రదాయం అట. అక్కడి ప్రజలు స్వయంగా మొసలిని వేటాడి దాని మాంసం, రక్తం, చర్మాన్ని పలు ఉత్పత్తులో ఉపయోగిస్తారట. ఇంతకీ ఎక్కడో తెలుసా?

మనదేశంలో మాంసాహారం అనగానే మటన్, చికెన్, చేపలు సర్వసాధారణంగా మాంసాహార ప్రియులంతా తింటారు. మాంసాహారం కోసం కోళ్ల ఫారాలు మేకల ఫారాలు ఏర్పాటు చేసి మరి వాటిని పెంచుతారు. కానీ థాయిలాండ్ దేశంలో మాత్రం పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి తరహాలో అక్కడ దేశస్థులు మొసళ్లను తింటారు. చూడగానే ఒళ్ళు గగుర్పాటు పుట్టించే మొసళ్లను తినడం ఏంట్రా బాబు అని.. మనం అనుకోవచ్చు. కానీ వీటిని ఏకంగా చేపల చెరువు లాగా మొసళ్ల చెరువు ఏర్పాటు చేసి మరి పెంచుతుంటారు. దీనికి సంబంధించిన కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం.

థాయిలాండ్ లో మొసలి మాంసం కిలో రూ. 570కి విక్రయిస్తుంటారు. అంతేకాదు మొసలి రక్తం కిలో రూ. 1,000, ఇత్తుల పొట్టు (పిత్త) కిలో రూ. 76,000కు విక్రయిస్తున్నారు. వీటిని పలు రకాల మందుల్లో ఉపయోగిస్తారు. వీటిని కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. మొసలి చర్మంతో బ్యాగులు తయారు చేస్తారు. వీటి ధర రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. ఇక మొసలి చర్మంతో తయారు చేసే లెదర్ సూట్ ధర రూ. 4లక్షల వరకు పలుకుతోంది.

మొసలి మాంసం, చర్మం, రక్తం కేవలం థాయిలాండ్ లోనే కాదు విదేశాల్లోనూ బాగా ప్రాచూర్యం పొందింది. వీటికోసం ఏకంగా మొసళ్ల ఫారాలనే ఏర్పాటు చేశారు. ఈ ఫారాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు థాయిలాండ్ కు వస్తుంటారు. పలు నివేదికల ప్రకారం థాయిలాండ్ లో గత 35ఏళ్లుగా మొసళ్ల పెంపకం వ్యాపారంగా కొనసాగుతోంది. అంతేకాదే ఈ దేశానికి ఇదే ముఖ్యమైన ఆర్థిక వనరుగా మారింది. థాయిలాండ్ లో మొసళ్ల పెంపకం ఒక ప్రత్యేక సంప్రదాయం మాత్రమే కాదు..స్థానిక ప్రజలకు ఉపాధి, అవకాశాలను కల్పిస్తూ ఆర్థికంగా అండగా ఉంటోంది. 

Tags:    

Similar News