Home Loan: కొత్త ఇంటి కోసం హోం లోన్ తీసుకుంటున్నారా.. అయితే ఏ బ్యాంకులో తీసుకుంటే లాభదాయకమో తెలుసుకోండి
Home Loan: మీరు హోంలోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా. అయితే హోంలోన్ కోసం ఏ బ్యాంకును ఎంచుకోవాలనుకుంటున్నారు. హోంలోన్ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు తో సహా అనేక ఇతర అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
Home Loan: నేటికాలంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. దీంతో చాలా మంది తప్పనిసరిగా బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఇంటిని కొనుగోలు చేయడం లేదంటే నిర్మించేందుకు బ్యాంకుల్లో హోంలోన్ తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే బెస్ట్ హోంలోన్ పొందడం ద్వారా రుణకాల వ్యవధిలో లోన్ తీసుకున్నవారికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకోవచ్చు.
అందుకే తక్కువ వడ్డీకే లోన్ ఇస్తూ ఇతర అంశాల్లోనూ రుణ గ్రహీతకు అనుకూల నిర్ణయాలు ఉన్న బ్యాంకును ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. హోంలోన్స్ ఖర్చు తగ్గించుకునేందుకు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హోంలోన్ అంటే పెద్దమొత్తంలో ఉంటుంది. దీర్ఘకాలం పాటు నెలలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందో చెక్ చేసుకోవాలి. 1శాతం వడ్డీ రేటు తగ్గినా లక్షల్లో ఆదా అవుతుంది. అందుకే తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులనే ఎంచుకోవడం ఉత్తమం. ఉదాహరణకు మీరు రూ. 50లక్షల లోన్ 10శాతం వడ్డీతో 20ఏళ్ల కోసం తీసుకుంటే అప్పుడు వడ్డీ రూ. 65.80లక్షల కట్టాల్సి ఉంటుంది. అదే 9శాతం వడ్డీ అయితే రూ. 57.96లక్షలు అవుతుంది. అంటే 1శాతం వడ్డీ తక్కినట్లయితే రూ. 7.80లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
ఇక హోంలోన్ తీసుకునేవారు ముఖ్యంగా లోన్ ప్రాసెసింగ్, లీగల్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు, లోన్ స్టాంప్ డ్యూటీ, ఇన్టిమేషన్ ఛార్జీలు అనేవి బ్యాంకులను బట్టి మారుతుంటాయి. లోన్ మొత్తంలో 0.25శాతం నుంచి 2శాతం వరకు ఉంటాయి. 1శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటే రూ. 50లక్షల లోన్ పై రూ. 50వేలు అవుతుంది. అందుకే తక్కువ ఉన్న బ్యాంకులనే ఎంపిక చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు ఇస్తుంటాయి. ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తుంటాయి. అలాంటి బ్యాంకులను ఎంచుకుంటే మరింత భారం తగ్గుతుంది.
ఇక హోంలోన్ తీసుకునే ముందు లోన్ రూల్స్, బ్యాంకు పాలసీలు పూర్తిగా చదవాలి. తక్కువ నిబంధనలను ఉన్నబ్యాంకు నుంచి హోంలో లోన్ తీసుకోవడం మంచిది. కొన్ని బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్పెషల్ కేటగిరీలోని వారికి ప్రత్యేక ఆఫర్స్ ఇస్తుంటాయి. వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తాయి. లాంటి ఆఫర్లకు అర్హత ఉంటే ఆయా బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ఉత్తమం. మేలైన సేవలు అందించే బ్యాంకుల నుంచి హోంలోన్ తీసుకోవడం బెస్ట్.