ICICI Credit Card: ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా... అయితే వచ్చే నవంబర్ నుంచి మీకు షాక్ తగలడం ఖాయం.. ఎందుకంటే..?

ICICI Credit Card: ఇటీవలి కాలంలో పలు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను కూడా తగ్గిస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ దిశగా పెద్ద అడుగు వేసింది.తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది.

Update: 2024-10-14 03:30 GMT

ICICI Credit Card: ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా... అయితే వచ్చే నవంబర్ నుంచి మీకు షాక్ తగలడం ఖాయం.. ఎందుకంటే..?

ICICI Credit Card: ఇటీవలి కాలంలో పలు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను కూడా తగ్గిస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ దిశగా పెద్ద అడుగు వేసింది.తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. ఈ కొత్త నిబంధనల ప్రభావం నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం బీమా, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, కిరాణా కొనుగోళ్లు ఇంధన సర్‌ఛార్జ్‌లపై ప్రయోజనాలను తగ్గించడమే కాకుండా విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌పై కొత్త షరతులను కూడా విధిస్తుంది.

ఇంతకుముందు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి ప్రవేశించడానికి క్వార్టర్‌లో రూ.35,000 ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని రూ.75,000కి పెంచారు, అంటే త్రైమాసికానికి భారీ మొత్తం. ఈ మార్పు అనేక సహ-బ్రాండెడ్ కార్డ్‌లతో సహా చాలా మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లను ప్రభావితం చేస్తుంది. ఈ మార్పు తర్వాత, కార్డ్ హోల్డర్లు ఇప్పుడు విమానాశ్రయ లాంజ్ ప్రయోజనాలను పొందేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పాఠశాల-కాలేజీ ఫీజులపై లావాదేవీ సర్ చార్జీ వసూలు:

ఐసీఐసీఐ బ్యాంక్ స్కూల్, కాలేజీ ఫీజు చెల్లింపునకు సంబంధించిన నిబంధనలను కూడా మార్చింది. ఇప్పుడు మీరు Cred, Paytm, MobiKwik వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఫీజు చెల్లిస్తే, మీరు ఒక శాతం ట్రాన్సాక్షన్ చార్జీ చెల్లించాలి. అయితే, మీరు పాఠశాల లేదా కళాశాల వెబ్‌సైట్ లేదా POS మెషీన్‌ని ఉపయోగించి చెల్లింపు చేస్తే, అదనపు రుసుము వసూలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించే వారికి ఈ నియమం చాలా ముఖ్యం.

యుటిలిటీ బీమా చెల్లింపులపై తక్కువ రివార్డులు:

ఐసిఐసిఐ బ్యాంక్ యుటిలిటీ బీమా చెల్లింపులపై లభించే రివార్డ్ పాయింట్ల పరిమితిని కూడా తగ్గించింది. ప్రీమియం కార్డ్ హోల్డర్‌లు ఇప్పుడు ప్రతి నెలా రూ. 80,000 వరకు యుటిలిటీ బీమా చెల్లింపులపై రివార్డ్‌లను పొందవచ్చు, ఇతర కార్డ్ హోల్డర్‌లకు ఈ పరిమితి రూ. 40,000 మాత్రమేనని తెలిపింది.

కిరాణా డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో రివార్డ్ పాయింట్‌లు కట్:

ఐసిఐసిఐ బ్యాంక్ కిరాణా డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో లభించే రివార్డ్ పాయింట్లపై కూడా పరిమితి విధించింది. ఇప్పుడు ప్రీమియం కార్డ్ హోల్డర్‌లు ప్రతి నెలా రూ. 40,000 వరకు మాత్రమే రివార్డ్‌లను పొందగలరు, అయితే ఇతర కార్డ్ హోల్డర్‌లందరూ రూ. 20,000 వరకు మాత్రమే రివార్డ్‌లను పొందగలరు.

ఇంధన సర్‌ఛార్జ్‌పై మినహాయింపుపై కొత్త పరిమితి:

ఐసిఐసిఐ బ్యాంక్ ఇంధన సర్‌ఛార్జ్‌పై తగ్గింపు పరిమితిని కూడా తగ్గించింది. ఇప్పుడు మీరు పెట్రోల్ డీజిల్‌పై ప్రతి నెల గరిష్టంగా రూ. 50,000 ఖర్చు చేయగలుగుతారు. ఈ పరిమితి ఎమరాల్డ్ మాస్టర్ కార్డ్ మెటల్ క్రెడిట్ కార్డ్‌పై మాత్రమే రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉంది. .

Tags:    

Similar News