Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold And Silver Rates: దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold And Silver Rates: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. గత రెండు మూడురోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర 200 రూపాయలు తగ్గింది. అక్టోబర్ 16 బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,900 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71, 563 పలికింది.
కాగా గత వారం రోజులుగా బంగారం ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురవుతున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులు బంగారం కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఇదెలా ఉంటే గడిచిన మూడు నెలల్లో చూస్తే బంగారం ధర జులై చివరి వారంలో 67వేలు మాత్రమే ఉంది. బడ్జెట్ సందర్భంగా కేంద్ర్ సర్కార్ దిగుమతి సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. ఈసమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి.
కానీ ఒకటి రోజులు మినహా మళ్లీ వేగంగా బంగారం ధర పుంజుకుంది. నేడు ఏకంగా 78వేల రూపాయల ఎగువన రికార్డు ధరను పలుకుతోంది. ప్రస్తుతం రికార్డు ధర సమీపంలో ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహం చాలా మందిలో ఉంది.
అంతర్జాతీయ పరిస్థితులను అంచనా వేస్తే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఈ ఆందోళనలను మరింత ఉద్రుతం చేసింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
బంగారం ధరలు భారీగా పెరిగితే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.