Bank Holidays: జూన్‌లో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?
Bank Holidays: మే నెల ముగియబోతోంది. మరో వారం రోజుల్లో జూన్ ప్రారంభమవుతుంది...
Bank Holidays: మే నెల ముగియబోతోంది. మరో వారం రోజుల్లో జూన్ ప్రారంభమవుతుంది. అందుకే ఆర్బీఐ జూన్‌కి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. జూన్‌లో బ్యాంకుకి సంబంధించి ఏదైనా పని ఉంటే ముందుగానే చేసుకోండి. లేదంటే సెలవు రోజుల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కసారి సెలవుల జాబితాని తనిఖీ చేయండి. ఆర్బీఐ రాష్ట్రాల పండుగల ప్రకారం సెలవులను ప్రకటించింది. శనివారం, ఆదివారం కాకుండా ఈ నెలలో రాష్ట్రాలలో వచ్చే కొన్ని ప్రత్యేక సెలవులు ఉన్నాయి. వాటి గురంచి పూర్తిగా తెలుసుకుందాం.
జూన్ 2 - మహారాణా ప్రతాప్ జయంతి / తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం - హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణలలో సెలవు
జూన్ 3 - శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం - (ఈ రోజున పంజాబ్‌లో మాత్రమే సెలవు ఉంటుంది)
జూన్ 5 - ఆదివారం
జూన్ 11 - రెండవ శనివారం
జూన్ 12 - ఆదివారం
జూన్ 14 - మొదటి రాజు / సాధువు గురు కబీర్ జన్మదినం - ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, పంజాబ్‌లో సెలవు
జూన్ 15 - రాజా సంక్రాంతి / YMA డే / గురు హరగోవింద్ జీ పుట్టినరోజు - ఒడిశా, మిజోరం, జమ్మూ, కాశ్మీర్‌లో సెలవు
జూన్ 19 - ఆదివారం
జూన్ 22- ఖర్చీ పూజ- త్రిపురలో మాత్రమే సెలవు ఉంటుంది
జూన్ 25 - నాల్గవ శనివారం
26 జూన్ - ఆదివారం
జూన్ 30- రామనా నీ- మిజోరంలో మాత్రమే సెలవు ఉంటుంది
వివిధ రాష్ట్రాల్లో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.ఆర్‌బీఐ సెలవు జాబితా ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వార్షికోత్సవాల దృష్ట్యా బ్యాంకులకు మొత్తం 12 రోజుల సెలవులు ఉంటాయి. ఇందులో రెండో, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఈ నెలలో పెద్దగా సెలవులు లేవు.