Bank Holidays: ఖాతాదారులకి అలర్ట్.. జూలైలో 14 రోజులు బ్యాంకులు బంద్..!
Bank Holidays: దేశవ్యాప్తంగా ప్రతిరోజు బ్యాంకుల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి.
Bank Holidays: దేశవ్యాప్తంగా ప్రతిరోజు బ్యాంకుల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. కానీ ఒక్కోసారి బ్యాంకులకి సెలవు దినాలలో ఖాతాదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశంలో చాలామంది ఇప్పటికీ బ్యాంకుకి వెళ్లి తమ పని పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే అన్ని పనులు ఆన్‌లైన్‌లో చేయలేరు. దీంతో బ్యాంకుకి వెళ్లడం తప్పనిసరి అవుతుంది. అయితే కొన్ని రోజుల్లో కొత్త నెల ప్రారంభం కాబోతుంది. జూలై 2022లో బ్యాంక్ సెలవులు ఎన్ని రోజులు ఉంటాయో తెలుసుకుందాం. దీనివల్ల ముందస్తు జాగ్రత్తతో మెలగవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జూలైలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. అయితే ఇవి మొత్తం దేశంలో ఒక రోజు సెలవులు కావు వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ ప్రకారం ఈ సెలవుల జాబితా ఉంటుంది. జూలైలో వచ్చే వివిధ సెలవుల జాబితాను తెలుసుకుందాం.
జూలై 1: కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర - భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్ మూసివేస్తారు.
3 జూలై: ఆదివారం (వారపు సెలవు)
జూలై 5: మంగళవారం - గురు హరగోవింద్ సింగ్ జీ ప్రకాష్ దివాస్ - జమ్మూ, కాశ్మీర్ బ్యాంక్ మూసివేస్తారు.
7 జూలై: ఖర్చి పూజ - అగర్తలాలో బ్యాంకులు మూసివేస్తారు.
జూలై 9 : శనివారం (నెలలో రెండవ శనివారం), ఈద్-ఉల్-అజా (బక్రీద్)
జూలై 10: ఆదివారం (వారపు సెలవు)
జూలై 11: ఈద్-ఉల్-అజా- జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.
జూలై 13: భాను జయంతి- గ్యాంగ్‌టక్ బ్యాంక్ మూసివేస్తారు.
జూలై 14: బెన్ డియెంక్లామ్ - షిల్లాంగ్ బ్యాంక్ మూసివేస్తారు.
జూలై 16: హరేలా - డెహ్రాడూన్ బ్యాంక్ మూసివేస్తారు.
జూలై 17: ఆదివారం (వారపు సెలవుదినం)
జూలై 23:శనివారం (నెల నాల్గవ శనివారం)
24 జూలై: ఆదివారం (వారపు సెలవు)
31 జూలై: ఆదివారం (వారపు సెలవు)