HDFC Bank: HDFC కస్టమర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెరిగిన వడ్డీ రేట్లు.. నేటి నుంచే అమలులోకి..

HDFC Bank: ఈ కొత్త రేట్లు మే 8నుంచి అమలులోకి వచ్చినట్లు హెచ్ డీ ఎఫ్ సీ అధికారులు ప్రకటించారు.

Update: 2023-05-08 11:59 GMT

HDFC Bank: HDFC కస్టమర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెరిగిన వడ్డీ రేట్లు.. నేటి నుంచే అమలులోకి..

HDFC Bank: మీరు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కస్టమరా..అయితే మీకొక బ్యాడ్ న్యూస్..ప్రైవేట్ రంగంలోని దిగ్గజ కంపెనీ అయిన హెచ్ డీఎఫ్ సీ...మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్) రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసీఎల్ ఆర్ అనుసంధానిత రుణాలు ప్రియం కానున్నాయి. వివిధ కాలపరిమితి రుణాలపై ఎంసీఎల్ ఆర్ రేట్లను 0.05 శాతం నుంచి 0.15 శాతానికి పెంచింది. తాజా నిర్ణయంతో హోమ్ లోన్, వెహికల్ లోన్ ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. ఈ కొత్త రేట్లు మే 8నుంచి అమలులోకి వచ్చినట్లు హెచ్ డీ ఎఫ్ సీ అధికారులు ప్రకటించారు.

ఎంసీఎల్ ఆర్ రేట్లు ఇలా ఉన్నాయి:

ఓవర్ నైట్: ప్రస్తుతం హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ ఆర్ రేటు 7.95 శాతానికి చేరింది.

ఒక నెల: ఒక నెల ఎంసీఎల్ ఆర్ రేటు విషయానికొస్తే అది 8.10 శాతానికి చేరింది.

3 నెలలు: మూడు నెలల ఎంసీఎల్ ఆర్ రేటు 8.40 శాతానికి పెరిగింది.

6 నెలలు: ప్రస్తుతం ఆరు నెలల ఎంసీఎల్ ఆర్ రేటు 8.80 శాతంగా ఉంది.

ఇక ఒక ఏడాది ఎంసీఎల్ ఆర్ రేటు 9.05, అలాగే 2 సంవత్సరాల ఎంసీఎల్ ఆర్ రేటు 9.10, అదే విధంగా 3 సంవత్సరాల ఎంసీఎల్ ఆర్ 9.20 శాతంగా ఉంది.

మొత్తంగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 నుంచి 15 పాయింట్ల మేర పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది నుంచి ఇప్పటివరకు రెపో రేట్లను ఆరు సార్లు పెంచింది. దీంతో గృహ రుణ వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ మరొకసారి రుణ వడ్డీ రేట్లను పెంచడంతో రుణగ్రహీతల ఈఎంఐలు మరోసారి పెరిగినట్లయింది.

Tags:    

Similar News