PPF: పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. ఈ విషయాలు గమనించండి..!
Public Provident Fund: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) భారత ప్రభుత్వం ప్రారంభించిన దీర్ఘకాలిక పెట్టుబడి స్కీమ్.
Public Provident Fund: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) భారత ప్రభుత్వం ప్రారంభించిన దీర్ఘకాలిక పెట్టుబడి స్కీమ్. ఈ ప్లాన్ మంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించేందుకు అనుమతిస్తుంది. ఒక వ్యక్తి కేవలం 500 రూపాయలతో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టగలిగే గరిష్ట మొత్తం రూ.1.5 లక్షలు మాత్రమే. అయితే పీపీఎఫ్ పథకం కొంత కాలం తర్వాత ఖాతాదారునికి రుణం, కొంత మనీ విత్ డ్రా సౌకర్యాన్ని అందిస్తుంది.
అర్హత ప్రమాణాలు
పీపీఎఫ్ ఖాతా అందరికీ సమానంగా అందుబాటులో ఉంటుంది. ఎవరైనా తన సొంత పేరు మీద పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. మైనర్ విషయంలో పిల్లల తరపున తల్లిదండ్రులు, సంరక్షకుల అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
పెట్టుబడి పరిమితి
ముందుగా చెప్పినట్లుగా ఈ పథకం కింద పెట్టుబడి పెట్టగల కనీస మొత్తం రూ.500 అయితే గరిష్ట మొత్తం సంవత్సరానికి రూ.1.5 లక్షలు మించవద్దు. పాలసీదారు ఏకమొత్తంలో చెల్లించడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు లేదా సంవత్సరంలో 12 సులభమైన వాయిదాలలో పెట్టుబడి పెట్టవచ్చు.
లాంగ్ టర్మ్ పాలసీ
పీపీఎఫ్ ఖాతాకు గరిష్ట వ్యవధి 15 సంవత్సరాలు. అయితే పాలసీ మెచ్యూరిటీ తర్వాత పాలసీదారుడు ఖాతా కాల వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు.
ఉత్తమ వడ్డీ రేట్లు
పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రతి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.1% ఖాతాలోని కనీస నిల్వపై లెకస్తారు.
పన్ను మినహాయింపు
పీపీఎఫ్ ఖాతాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అనుమతిస్తాయి. ఈ పథకం కింద వచ్చే రిటర్న్‌లు పన్ను రహితం.
సులభమైన లోన్, విత్ డ్రా
పీపీఎఫ్ పథకం ఖాతా వయస్సు, ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా సులభంగా రుణాలు, విత్ డ్రా లభ్యతను అనుమతిస్తుంది.
నామినీ సౌకర్యం
పీపీఎఫ్ ఖాతాకి నామినీ సౌకర్యం అందుబాటులో ఉంది. పాలసీదారు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీగా పెట్టుకోవచ్చు. వివిధ నామినీలకు ఎంత చెల్లించాలో కూడా నిర్ణయించవచ్చు
ఖాతా బదిలీ
పీపీఎఫ్ ఖాతా మరొక ప్రయోజనం ఏంటంటే ఇది బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. కాబట్టి మీరు పీపీఎఫ్ ఖాతాను మీ బ్యాంక్‌లోని ఏదైనా ఇతర బ్రాంచ్‌కి, ఏదైనా ఇతర పోస్టాఫీసుకు ఎటువంటి ఛార్జీలు లేకుండా బదిలీ చేయవచ్చు.