SC Verdict on Kerala's Padmanabha Swamy Temple: పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై ఆ రాజవంశస్తులకు హక్కు ఉంది
SC Verdict on Kerala's Padmanabha Swamy Temple: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై రాజవంశస్తులకు హక్కు ఉందిని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
SC Verdict on Kerala's Padmanabha Swamy Temple: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై రాజవంశస్తులకు హక్కు ఉందిని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దేవాలయ నిర్వహణ మరియు వ్యవహారాల నుండి రాజకుటుంబానికి చెందిన అన్ని హక్కులను హరించే విధంగా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. జస్టిస్ ఉదయ్ యు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెట్టింది. ఒకరి మరణం వల్ల దైవారాధనకు చెందిన హక్కులు ఆ కుటుంబంపై ప్రభావం చూపవని, ఇది ఆచారం ప్రకారం కొనసాగుతుందని సుప్రీం అభిప్రాయపడింది.
1991 లో ఆలయ చివరి పాలకుడు మరణించినంత మాత్రాన ఆలయ ఆస్తులను రాష్ట్రానికి బదిలీచేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీని అర్థం, ఆ రాజ కుటుంబం ఆలయ ధర్మకర్తగా కొనసాగుతుందని.. ప్రార్థనలు చేసే హక్కులను కూడా కలిగి ఉంటుందని, ఆలయ నిర్వహణ కూడా రాజవంశస్తులు నిర్వహిస్తారని పేర్కొంది. అలాగే తిరువనంతపురం జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలో ఆలయ పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలనీ.. ఈ కమిటీ రోజువారీ వ్యవహారాలు నిర్వహిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కమిటీలోని సభ్యులందరూ హిందువులే ఉండాలని, వారు రాష్ట్రంలో సంబంధిత శాసనం ప్రకారం పనిచేయాలని కూడా ఆదేశించింది.
కాగా పద్మనాభస్వామి ఆలయంలో లక్షల కోట్ల విలువైన సంపద ఉన్నట్లు తెలిసిందే. ఆ ఆస్తులపై సుప్రీంలో 9 ఏళ్ల క్రితం కేసు నమోదు అయ్యింది. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న రెండవ నేలమాలిగలో మరింత విలువైన సంపద ఉన్నట్లు కొందరు వాదించారు. దాంతో పద్మనాభస్వామి ఆస్తులపై కేసు ఆసక్తికరంగా మారింది. ఆలయ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా ఈ ఉత్తర్వులను పక్కనబెట్టాలని జస్టిస్ ఉదయ్ యూ లలిత్, ఇందూ మల్హోత్రలకు చెందిన ధర్మాసనం పేర్కొంది.