Erra Cheera: విడుదలకు సిద్ధమైన 'ఎర్రచీర-ది బిగినింగ్‌'.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఆ రోజే..

Erra Cheera - The Beginning movie: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది.

Update: 2024-11-04 07:21 GMT

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. "ఎర్రచీర - ది బిగినింగ్" మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

డిసెంబర్ 20న "ఎర్రచీర - ది బిగినింగ్" తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే మంగళవారం సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గ్లింప్స్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'"ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌కు రావడం సంతోషంగా ఉంది. హారర్, దేవుడు కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి కొత్త వాళ్లు రావాలి. అప్పుడే కొత్త టాలెంట్ మనకు దొరుకుతుంది. ఎర్రచీర సినిమా విజయం సాధించి ఈ టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చారు.

నటుడు సుమన్‌ బాబు మాట్లాడుతూ.. "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా గ్లింప్స్ ను ఈ రోజు కార్తీకమాసం పర్వదినం సందర్భంగా ఈ పెద్దల చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమాను రూపొందించాను. సినిమాలోని 22 పాత్రలతో పాటు ఎర్రచీర కూడా 23వ పాత్ర పోషిస్తుంది. మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బేబి సాయితేజస్విని నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంద'ని చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న పీఆర్ఓ, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -"ఎర్రచీర - ది బిగినింగ్" గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అంబికా కృష్ణ గారికి, భరద్వాజ అన్న గారికి థ్యాంక్స్. ఈ సినిమా కథను సుమన్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని అనిపించింది. ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ప్రేక్షకులకు ఏం కావాలో సుమన్ బాబుకు తెలుసు. ఆ ఎలిమెంట్స్ అన్నీ కలిపి "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా రూపొందించారు' అని తెలిపారు.

Tags:    

Similar News