Delhi Assembly Elections: ఢిల్లీ సీఎం అతిషి దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Delhi Assembly Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు దాడులు పెంచారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారం ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య వార్ ఉంది. రెండు పార్టీలు కూడా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసేందుకు భారీ ప్రచారం చేస్తున్నాయి. 25ఏళ్లుగా అధికారం చేజిక్కించుకోని బీజేపీ ఇప్పుడు ఎలాగైనా అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఢిల్లీ సీఎం అతిషి కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఎన్నికల అధికారి ఎదుట అఫిడవిట్ కూడా సమర్పించారు. ఈ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, అతిషి మొత్తం ఆస్తుల విలువ రూ.76.93 లక్షలు. అతిషి సంపద గత ఐదేళ్లలో 28.66 శాతం పెరిగిందని, అతిషికి సొంత కారు లేదా మరే ఇతర వాహనం కూడా లేదని పేర్కొంది. ఆమెకు ఎలాంటి స్థిరాస్తి అంటే బంగ్లా లేదా ఫ్లాట్ లేవని తెలిపింది. ఆభరణాల పేరుతో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉన్నట్లు..అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం అతిషి తన వద్ద రూ.30 వేలు నగదు ఉందని, మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఫ్లైఓవర్ మార్కెట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ కాలనీ బ్రాంచ్‌లోని పొదుపు ఖాతాలో రూ.19,93,512, ఎఫ్‌డీలో రూ.32,85,459 ఉన్నాయని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ భోగల్ బ్రాంచ్‌లోని పొదుపు ఖాతాలో రూ.15,10,790, ఎఫ్‌డీలో రూ.7,53,613 ఉండగా, దీనితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన కల్కాజీ మెయిన్‌రోడ్ బ్రాంచ్ సేవింగ్స్ ఖాతాలో రూ.20 వేలు ఉన్నాయని తెలిపారు.
అయితే 2020లో అతిషిపై క్రిమినల్ పరువు నష్టం కేసు పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. అతిషిపై మొదటి క్రిమినల్ కేసు 2019లో రెండవది 2024లో నమోదైందని, అయితే ఇప్పటి వరకు ఆమెకు ఏ కేసులో శిక్ష పడలేదు.
సిఎం అతిషి తన పూర్తి పేరును అధికారిక పత్రంలో అతిషి మర్లెనా అని రాశారు. ఇంతకుముందు కూడా ఆమె ఈ పేరుతోనే పిలిచేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆమె అతిషి అని మాత్రమే రాస్తోంది. ఆమె ఇంటిపేరుపై వివాదం ఉండటంతో ప్రతిపక్షాలు కూడా దానిపై ప్రశ్నలు లేవనెత్తాయి. 2020లో, ఆమె తనను తాను త్రిప్తా వాహి కుమార్తె అని వ్రాసి, జంగ్‌పురా ఎక్స్‌టెన్షన్ చిరునామాను ఇచ్చింది. ఈసారి ఆమె తనను తాను విజయ్ కుమార్ సిన్హా కుమార్తె అని రాసి కల్కాజీ చిరునామాను ఇచ్చింది.
గత ఎన్నికల్లో జీవిత భాగస్వామి కాలమ్‌లో అతిషి ప్రవీణ్ సింగ్ పేరును పెట్టగా, ఈసారి అందులో 'నిల్' అని రాసింది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం, ప్రవీణ్ సింగ్ ఐఐటి.. ఐఐఎంలలో చదువుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని విద్యా సంస్కరణల రంగంలో అతిషితో కలిసి ఏడు సంవత్సరాలు పనిచేశాడు. అతీషి అఫిడవిట్‌లో ఆమె వృత్తిని 'రాజకీయవేత్త, ఢిల్లీ ముఖ్యమంత్రి' అని.. ఆమె ఆదాయ వనరును ఆమె జీతంగా పేర్కొన్నారు.