Ugadi 2025: ఉగాది తర్వాత ఈ 3 రాశులకు అఖండ రాజయోగం.. శనిదేవుడి అండతో పట్టిందల్లా బంగారం..!
Ugadi 2025 Lucky Zodiac Signs: మార్చి 30వ తేదీ ఉగాది పండుగ రానుంది. ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం. అంతేకాకుండా శని సంచారంలో మార్పు కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో అఖండ రాజయోగం పట్టబోతున్న మూడు రాశులు ఉన్నాయి. అందులో మీరు ఉన్నారా?

Ugadi 2025: ఉగాది తర్వాత ఈ 3 రాశులకు అఖండ రాజయోగం.. శనిదేవుడి అండతో పట్టిందల్లా బంగారం..!
Ugadi 2025 Lucky Zodiac Signs: విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాశుల్లో ఓ మూడు రాశులకు శని మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు. మార్చి 30వ తేదీ శని దేవుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూడు రాశులకు ఏడాది మొత్తం విశేష రాజయోగం, ధన లాభం కలుగుతుంది.
వృషభ రాశి..
వృషభ రాశికి శని సంచారం వల్ల విశేష యోగాలు కలుగుతాయి. విశ్వవసునామ సంవత్సరం ఏడాది మొత్తం వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరికి 11 స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఏడాది మొత్తం డబ్బుల వర్షం కురుస్తుంది. అంతేకాదు ఆర్థికం, ఆరోగ్యపరంగా కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది
మకర రాశి..
మార్చి 30వ తేదీ శని దేవుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మకర రాశికి అఖండ రాజయోగం పట్టబోతుంది. తృతీయంలో శని ఉంటే కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. అంతేకాదు స్థిరచరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
తులారాశి..
శని సంచారం వల్ల విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి అఖండ రాజయోగం పట్టబోతుంది. వీళ్లు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. తులా రాశి వారికి ఉగాది తర్వాత శని దేవుడి అండదండగా ఉంటానంటున్నాడు. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది.
విశ్వావసు నామ సంవత్సరంలో ఈ మూడు రాశులకు శనిదేవుడు విశేష యోగాలు కలిగిస్తాడు. ఈ నేపథ్యంలో వీరు కష్టపడి పనిచేస్తే అన్ని సాధించుకోగలరు. కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది ఏడాది మొత్తం ధనవర్షం ఖాయం.