Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (29/3/2025)
Daily Horoscope Today In Telugu, March 29, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 29, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం
తిధి: అమావాస్య సాయంత్రం గం.4.27 ని.ల వరకు ఆ తర్వాత చైత్ర పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సాయంత్రం గం.7.26 ని.ల వరకు ఆ తర్వాత రేవతి
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.11 ని.ల నుంచి గం.4.36 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.6.40 ని.ల నుంచి గం.8.05 ని.ల వరకు మళ్లీ రేపు తె.వా.గం.6.01 ని.ల నుంచి గం.7.25 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.6.13 ని.ల నుంచి గం.7.51 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.9.00 ని.ల నుంచి గం.10.30 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.13 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 6.29 ని.లకు
మేషం
అనూహ్యమైన ఖర్చులుంటాయి. బంధువులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. ఆత్మీయుల చికిత్స కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. బద్ధకం వల్ల సమస్య వస్తుంది.
వృషభం
అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. శత్రుపీడ తగ్గుతుంది. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం
అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో విందుకు హజరవుతారు. ఇతరులతో విరోధం ఏర్పడినా మీకే విజయం లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ధనలాభం ఉంది.
కర్కాటకం
పనులకు ఆటంకాలున్నా సత్ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మికవేత్తల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అనవసరపు ఖర్చులు తగ్గించాలి. న్యాయపరమైన అంశాల్లో నిర్లక్ష్యం పనికిరాదు.
సింహం
మనసు నిలకడగా ఉండదు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. చేస్తున్న పనుల్లోనూ పురోభివృద్ధి కనిపించదు. ప్రయాణాలు ప్రయోజనకరం కాదు. కోపాన్ని తగ్గించుకోవాలి. అనవసర జోక్యం వద్దు.
కన్య
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొత్త విషయాలు తెలుస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సంతాన విషయాలు తృప్తినిస్తాయి. ప్రయాణాలు సఫలం అవుతాయి. మనశ్శాంతి ఉంటుంది.
తుల
వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. స్వస్థానప్రాప్తి గోచరిస్తోంది. ఆత్మీయులను కలుసుకుంటారు. నూతన వస్తువులను కొంటారు. మనోవేదన తొలగిపోతుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది.
వృశ్చికం
బద్ధకం వల్ల సమస్యలు వస్తాయి. సంతానం తీరు చికాకు పెడుతుంది. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు ఉండదు. శిక్షణ వ్యవహారాలు ఆశించినట్లుగా సాగవు. వాత సమస్య ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త.
ధనుస్సు
పనులు అనుకున్న రీతిలో సాగవు. మనోవేదన కలుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లోనూ జాగ్రత్త అవసరం. బంధువుల సహకారం లభించదు. విద్య, సేవ, రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారు అప్రమత్తంగా వ్యవహరించాలి.
మకరం
మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. వ్యవహారాలు ఆశించినట్లే సాగుతాయి. ఆత్మీయులతో కలుస్తారు. విందులో పాల్గొంటారు. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సోదరుల సహకారం లభిస్తుంది.
కుంభం
ముందుచూపుతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయం వద్దు. మాట తప్పడం వల్ల సమస్యలొస్తాయి. ఆస్తి వ్యవహారాలు లాభించవు. రెండో పెళ్లి ప్రయత్నాలకు బ్రేక్ పడుతుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి.
మీనం
వ్యవహారజయం ఉంది. అన్నీ అనుకున్నరీతిలోనే సాగుతాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలు ఆత్మానందాన్నిస్తాయి.