Ugadi 2025 Capricorn Horoscope: శ్రీ విశ్వవసునామ సంవ్సతరం.. ఉగాది తర్వాత మకర రాశివారికి జరిగేది ఇదే..

Ugadi 2025 Capricorn Horoscope: గ్రహాల స్థితి గతుల రీత్యా.. మకర రాశివారికి ఈ సంవత్సరం కూడా దాదాపుగా గత ఏడాది మాదిరిగానే, సాధారణ అనుకూలతలతో సాగుతుంది.

Update: 2025-03-30 01:45 GMT

Ugadi 2025 Capricorn Horoscope: శ్రీ విశ్వవసునామ సంవ్సతరం.. ఉగాది తర్వాత మకర రాశివారికి జరిగేది ఇదే..

ఆదాయం-8

వ్యయం- 14

రాజపూజ్యత- 4

అవమానం-5

Ugadi 2025 Capricorn Horoscope: గ్రహాల స్థితి గతుల రీత్యా.. మకర రాశివారికి ఈ సంవత్సరం కూడా దాదాపుగా గత ఏడాది మాదిరిగానే, సాధారణ అనుకూలతలతో సాగుతుంది. ప్రయత్నించిన ప్రతి కార్యమూ, కొన్ని ఒడుదుడుకులు ఎదురైనా, చివరికి విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరిలోనూ సానుకూల దృక్పథం పెరుగుతుంది. సంతానం స్థిరత్వాన్ని సాధిస్తుంది. మీ విషయంలో శత్రువులు చేసే కుట్రలు కూడా మీకే అనుకూలంగా మారతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కలిసివస్తాయి. గృహ, భూ, వస్తు, వాహన లాభాలుంటాయి.

ఆర్థిక పరిస్థితులు కాస్తంత మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వీరి కారణంగా అభివృద్ధి, ధనలాభం గోచరిస్తున్నాయి. తరచూ విందు వినోదాల్లో పాల్గొంటారు. విహార యాత్రలు చేస్తారు. ప్రతి పనినీ రెట్టించిన ఉత్సాహంతో చేసే స్వభావం కారణంగా, సత్ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలంగా వేధిస్తోన్న సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. దైవకార్యాల్లో నిమగ్నమవుతారు. డబ్బు వృథా కాకుండా సద్వినియోగం చేస్తారు. కుటుంబ అవసరాల కోసం కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీలైనంత వరకు నోటిదురుసును తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ఆశాజనకంగా ఉంటుంది. ప్రైవేటు రంగంలోని వారు తగినంత ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. ఆశించిన ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆశించిన రీతిలోనే బదిలీలు, ప్రమోషన్లు అందుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపునూ పొందుతారు. తగిన పురస్కారాలను అందుకుంటారు. విదేశాల్లో ఉంటూ ఉద్యోగ స్థిరత్వం కోసం ప్రయత్నించే వారికి ఆశించిన ఫలితం లభిస్తుంది.

వ్యాపారులు ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను పొందుతారు. పోటీదారుల కన్నా ముందంజగా ఉంటారు. వ్యాపారాలు సజావుగా సాగడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వృత్తిపరమైన వ్యాపారాలు, కులవృత్తి ఆధారంగా చేసే వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. అనూహ్యమైన ప్రోత్సాహం, ఆకస్మిక ధనయోగం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణలకు, కొత్తగా అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలతో ముడిపడిన వ్యాపారాలూ వృద్ధి చెందుతాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లకు చెందిన పెట్టుబడిదారులకు ఆశించినదానికన్నా మెరుగైన లాభం ఉంటుంది. వీరు లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.

రాజకీయ రంగాల వారికి చాలా మేలిమి ఫలితాలుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల ఆశీస్సులు పుష్కలంగా దక్కుతాయి. ఆశించిన పదవులను అందుకోగలుగుతారు. ప్రజాజీవనంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మాటపలుకుబడి బాగా పెరుగుతుంది. అవకాశాలను దుర్వినియోగం చేసుకోకండి.

విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఘనవిజయం సాధించి ఆశించిన ర్యాంకులను కైవసం చేసుకుంటారు. ఒక్కోసారి అతి విశ్వాసంతో వెనుకబడే సూచనలున్నాయి. విదేశీ విద్యాయత్నాలు అనుకూలిస్తాయి.

ఈరాశి వారు, లక్ష్మీదేవిని, దుర్గాదేవిని ఆరాధించడం, కేశవ నామాలు స్మరించడం మంచిది. దుర్గా సప్తశతి, అడపాదడపా రాహుగ్రహ శాంతి దానాలు చేయిస్తే చిన్నపాటి దోషాలూ తొలగిపోతాయి.

Tags:    

Similar News