Ugadi 2025 Sagittarius Horoscope: ధనుస్సు రాశివారికి 2025-26లో జరిగేది ఇదే.. కలలో కూడని ఊహించని మార్పు..

Ugadi 2025 Sagittarius Horoscope: విశ్వావసు సంవత్సరంలో.. ధనూరాశికి చెందిన అన్ని రంగాల వారికీ సాధారణ ఫలితాలే ఉంటాయి.

Update: 2025-03-30 01:30 GMT

Ugadi 2025 Sagittarius Horoscope: ధనుస్సు రాశివారికి 2025-26లో జరిగేది ఇదే.. కలలో కూడని ఊహించని మార్పు..

ఆదాయం-5

వ్యయం- 5

రాజపూజ్యత-1

అవమానం-5

Ugadi 2025 Sagittarius Horoscope: విశ్వావసు సంవత్సరంలో.. ధనూరాశికి చెందిన అన్ని రంగాల వారికీ సాధారణ ఫలితాలే ఉంటాయి. ఏప్రిల్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రతికూలతలు ఎక్కువగా అనిపిస్తాయి. మిగిలిన నెలల్లో పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. అనుకోని ఆటంకాల వల్ల పనులు ఆలస్యమైనా, అంతిమంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనినీ స్వీయ పర్యవేక్షణలోనే కొనసాగించండి. ఇతరులపై ఆధారపడడం వల్ల కష్టనష్టాలు ఎదురవుతాయి. సోదరులు, స్నేహితులు, బంధువర్గాల వ్యవహారాల్లో వీలైనంత వరకు జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. అతిగా నమ్మడం, అస్సలు నమ్మకపోవడంలా కాకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది.

ఆర్థికంగా బలపడతారు. పొదుపు చర్యలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని అప్పులను తీర్చగలుగుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి, వస్తు, వాహనాలను కొనుగోలు చేసే యోగం ఉంది. అయితే, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని గుర్తించండి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తక్షణ స్పందన వల్ల సమస్య నుంచి గట్టెక్కుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈ రాశివారికి అర్ధాష్టమ శని ప్రారంభమైనా, దాని ప్రభావం పెద్దగా బాధించదు.

వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆశాజనకంగా ఉన్నా, ఆర్థిక పురోగతి మందస్థాయిలో ఉంటుంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, తరచూ పైఅధికారులతో మాట పడాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతాయి. ఉద్యోగ స్థిరత్వంపై నిరంతరం భయాలు వెంటాడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త మెరుగ్గా ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు కొద్దిపాటి ఆలస్యంగా అయినా, ఆశించిన రీతిలోనే ఉంటాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు.

వ్యాపారులకు శుభ ఫలితాలుంటాయి. ఆశించిన లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన సమయం కాదు. భవిష్యత్తుపై ఆశతో.. ఉన్నదానితో సంతృప్తి చెందడం మంచిది. వృత్తిపరమైన వ్యాపారాలు, కులవృత్తుల ఆధారిత వ్యాపారాలు చేసే వారికి సంతోషకరంగా ఉంటుంది. వీరికి ఆర్థికంగానూ అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లలోని వారికి మధ్యస్థ ఫలితాలే ఉంటాయి.

రాజకీయ రంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. ఆశించిన పదవులు, హోదాలు దక్కినట్లే దక్కి చేజారే సూచనలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో అవమానాలు ఎదురు కాకుండా ప్రణాళికాబద్ధంగా నడచుకోవాలి.

విద్యార్థులు ఆశించిన ఫలితం సాధించడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. అడుగడుగునా విఘ్నాలు వస్తుంటాయి. మనోధైర్యంతో, ప్రణాళికాబద్ధంగా అధ్యయనం సాగించాలి. పోటీ పరీక్షల్లో ర్యాంకులను ఆశించేవారు రెట్టింపు కష్టపడాలి. విదేశీ విద్యాప్రయత్నాలు అనుకున్నంత తేలిగ్గా నెరవేరవు.

ఈ రాశివారు ఆంజనేయ స్వామికి నిత్యపూజలు, శ్రీరామరక్షాస్తోత్ర పారాయణ చేయడం మేలు చేస్తుంది. తరచూ కాలభైరవ స్వామి ఆరాధన, కాలభైరవాష్టక పఠనం వల్ల కూడా మరింత శుభం జరుగుతుంది.

Tags:    

Similar News