Vastu Tips: ఇంటి బాత్రూంలో ఈ 5 వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదు.. తస్మాత్ జాగ్రత్త..!
Bathroom Vastu Tips: వాస్తు శాస్త్రం ఎంతో గొప్పది. ఇంట్లోకి పాజిటివిటీ రావాలన్నా ఆ ఇంట్లో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలన్నా వాస్తును అనుసరించడం ఎంతో ముఖ్యం.

Vastu Tips: ఇంటి బాత్రూంలో ఈ 5 వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదు.. తస్మాత్ జాగ్రత్త..!
Bathroom Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నలు దిక్కుల్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో దాని అనుసరించి పెడతాం. అంతేకాదు వంటగది, బాత్రూం, హాల్ వంటివి కూడా సరైన దిశను తెలుసుకొని నిర్మించుకోవాలి. లేకపోతే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. అయితే వాస్తు ప్రకారం బాత్రూం లో ఉండకూడని ఐదు వస్తువులు ఉన్నాయి. అక్కడ పెట్టడం వల్ల ఇంట్లోకి దురదృష్టానికి ఆహ్వానిస్తాయి. ఇంటి బాత్రూం లో పెట్టకూడని ఐదు వస్తువులు ఇంట్లో తెలుసుకుందాం
ఖాళీ బకెట్..
చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్‌లో బకెట్ అలాగే ఖాళీగా వదిలేస్తారు. అందులో నీళ్లు ఉంటే పారబోసి అలాగే వదిలేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి బాత్రూంలో బకెట్ ఎప్పుడు నింపి పెట్టాలి. అదనంగా అది ఇంటి బకెట్ పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
విరిగిన అద్దాలు..
బాత్రూంలో విరిగిన అద్దాలు ఉండకూడదు. ఇది ఇంటికే శుభం ఇంటి బాత్రూంలో ఇలాంటివి చూడటం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవడుతుంది.
మొక్కలు..
చాలామంది అలంకరణ కోసం ఇంటి బాత్రూంలో మొక్కలు పెట్టుకుంటారు. అంతేకాదు ఇవి అక్కడున్న తడిని గ్రహించేస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిపోయిన మొక్కలు ఇంటికి అశుభం.
వాటర్ ట్యాప్..
ఇంట్లో లీక్ అయ్యే వాటర్ ట్యాప్‌లను కూడా ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకోవాలి. నీళ్ళు నల్ల నుంచి వెళ్లిపోతే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాదు నెగటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
తడి బట్టలు...
ఇంటి బాత్రూంలో ఎప్పుడూ తడి బట్టలు వదిలేయకూడదు. ఇది కూడా వాస్తు దోషానికి దారి తీస్తుంది. అంతేకాదు ఆ ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బాత్రూంలో అలా తడి బట్టలు వదిలేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి వెళ్లిపోతుంది.