Money Vastu: ఇంట్లో డబ్బును సరైన స్థలంలోనే పెడుతున్నారా? పొరపాటు చేస్తే ఒక్క పైసా మిగలదు..

Money Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపడతారు. అయితే ఇంట్లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి. తద్వారా ఇంట్లోకి పాజిటివిటీ పెరిగి.. ధన వృద్ధి కూడా జరుగుతుంది.

Update: 2025-04-07 02:30 GMT
Money Vastu

Money Vastu: ఇంట్లో డబ్బును సరైన స్థలంలోనే పెడుతున్నారా? పొరపాటు చేస్తే ఒక్క పైసా మిగలదు..

  • whatsapp icon

Money Vastu Tips: సాధారణంగా మనం ఇంట్లో బీరువాలో డబ్బులు దాచుకుంటాం. లేకపోతే లాకర్లో పెట్టుకుంటాం. అయితే బీరువా ఏర్పాటు చేసే దిశ మాత్రమే కాకుండా బీరువాలో డబ్బు ఎక్కడ పెడుతున్నామో అనేది కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే ఇంటి ఏ దిశలో ఏ వస్తువు పెట్టాలో కూడా జ్యోతిష్యులను మేరకు ఏర్పాటు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సుతోపాటు ధనవృద్ది కూడా జరుగుతుంది. అయితే పొరపాటున డబ్బులు ఇంట్లో సరైన దిశలో పెట్టకపోతే ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి..

మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకునే అల్మారా లేకపోతే లాకర్ బాత్రూమ్‌కు ఆనుకొని ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం ఇలా ఉండటం వల్ల ఇంట్లో ధనవృద్ది ఉండదు. పెండింగ్‌లో పనులు పడిపోతాయి, ఆర్థిక ఊబిలోకి పడిపోతారు.

అంతేకాదు ఇంట్లో డబ్బు పెట్టే అల్మారా చీకటి గదిలో ఉండకుండా సహజంగా కాంతి వచ్చే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సఖ్యత పెరుగుతుంది పాజిటివిటీ కూడా చోటు దొరుకుతుంది. ఏర్పాటు చేసుకుంటే మంచిది లేకపోతే నష్టాలకు దారితీస్తుంది.

అంతేకాదు మరీ మూలలో కూడా అల్మారా ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే అక్కడ శక్తి ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు అందులో డబ్బు పెట్టినా కానీ పాజిటివిటీ పెరగదు. డబ్బు కూడా పెరగకుండా ఉంటుంది.

అల్మారాలో మాత్రమే కాదు కొంతమందికి వంటగదిలో డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది. ఇది కూడా సరైన పద్ధతి కాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు అంటే లక్ష్మీదేవితో పోలుస్తారు డబ్బును అక్కడ ఇక్కడ పెట్టేస్తారు. ఇలా చేయకూడదు ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది.

ఎన్నో ఏళ్లుగా మంచం కింద డబ్బులు పెట్టే అలవాటు ఉంటుంది. దీని వల్ల పేదరికం ఎక్కువ అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో మంచం కింద పొరపాటున కూడా డబ్బులు పెట్టకూడదు. మరి కొంతమంది తెలియక దక్షిణ దిశలో అల్మరాను ఏర్పాటు చేసుకుంటారు. దక్షిణ దిశ వాస్తు దోషం.

Tags:    

Similar News