Akshaya Tritiya: రాబోయే అక్షయ తృతీయ.. అదృష్ట ధనం అందుకునే 4 రాశులు..!
Akshaya Tritiya Lucky Signs: ప్రతి ఏడాది అక్షయ తృతీయ వస్తుంది. ఆరోజు బంగారం కొనుగోలు చేస్తారు. హిందూ మతంలో పరమ పవిత్రమైన రోజు. అందుకే హిందువులు వేడుకగా జరుపుతారు.

Akshaya Tritiya: రాబోయే అక్షయ తృతీయ.. అదృష్ట ధనం అందుకునే 4 రాశులు..!
Akshaya Tritiya Lucky Signs: అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఆరోజు బంగారం, వెండి వంటి శుభకరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ రానుంది. ఆరోజు అరుదైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 రాశుల వారికి అదృష్ట ధనవర్షం కురుస్తుంది. ఆరోజు లక్ష్మీనారాయణ యోగంతో పాటు గజకేసరి, సర్వార్థ సిద్ది యోగం కూడా ఏర్పడుతుంది. అక్షయ తృతీయ నుంచి అదృష్ట ధనం కురిసే రాశులేవో తెలుసుకుందాం
మకర రాశి..
మకర రాశి వారికి అక్షయ తృతీయ నుంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది. శనిదేవుడు విశేష ఆశీస్సులు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో మకర రాశి వారికి ధన లాభం భారీగా కురుస్తుంది. అక్షయ తృతీయ రోజు నుంచి మకర రాశి వారు అద్భుత యోగాలు చూస్తారు. ప్రధానంగా లక్ష్మి ఆశీస్సులు ఉంటాయి.
కుంభరాశి..
అక్షయ తృతీయ నుంచి కుంభ రాశి వారికి కూడా శుభకాలం ప్రారంభమవుతుంది. కొత్త పనులు చేపడతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. కెరీర్‌లో పురోగతితో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి..
అక్షయ తృతీయ నుంచి కర్కాటక రాశి కూడా అద్భుత యోగం కలిసి వస్తుంది. వీరి కోరుకున్న ఉద్యోగం లభించడంతోపాటు వీళ్లకు వ్యాపారంలో భారీ లాభాలు కలిసి వస్తాయి. అంతేకాదు బంగారం, వెండి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారికి అశేష యోగాలు అక్షయ తృతీయ నుంచి కలిసి వస్తుంది.
తులారాశి..
తులా రాశి వారికి కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. వీరికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అంతే కాదు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అక్షయ తృతీయ నుంచి వీళ్లకు డబ్బు పెరుగుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)