Shadastaka Yoga: షడాష్టక యోగం.. ఈ 4 రాశులకు వరుస కష్టాలు, ఆర్థిక నష్టాలు..!
Shadastaka Yoga: షడాష్టక యోగంలో వల్ల కొన్ని రాశులకు ఆర్థికంగా నష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రతి పనిలో వీరికి అపజయాలు కలుగుతాయి.

Shadastaka Yoga: షడాష్టక యోగం.. ఈ 4 రాశులకు వరుస కష్టాలు, ఆర్థిక నష్టాలు..!
Shadastaka Yoga: షడాష్టక యోగంలో వల్ల కొన్ని రాశులకు ఆర్థికంగా నష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రతి పనిలో వీరికి అపజయాలు కలుగుతాయి.
ఇటీవలే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో గ్రహాల కదలిక ప్రతి ఒక్క రాశులపై ప్రభావం పడుతుంది. కుజుడు ఇప్పటికే కర్కాటక రాశిలో ఉన్నాడు. అయితే కుంభరాశిలో రాహువు ఉన్నాడు. ఈ నేపథ్యంలో శత్రు గ్రహం ఏర్పడి షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశులకు అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి.షడాష్టక యోగం వల్ల అప్పుల బాధలతో వేధించబడే కొన్ని రాశులు ఉన్నాయి. ఈ యోగం వల్ల వీరికి మే 2025 వరకు ఆర్థిక నష్టాలు ఒత్తిడితో కూడిన జీవితం కలుగుతుంది.
సింహరాశి ..
షడాష్టక యోగం వల్ల సింహరాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. పని ప్రదేశంలో వీళ్లకు ఒత్తిళ్లు తప్పవు. ఈ యోగం వల్ల వీరికి ఆర్థిక నష్టాలు తప్పవు. ప్రతి పనిలో అపజయాలే ఉంటాయి. శత్రువులు కూడా పెరిగిపోతారు. ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. పని ప్రదేశంలో సఖ్యతతో మెలగాలి. ఆచితూచి అడుగు వేయాలి. లేకపోతే కీర్తి ప్రతిష్టలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్యం పై కూడా జాగ్రత్త వహించక తప్పదు.
కర్కాటక రాశి..
ఈ యోగం వల్ల కర్కాటక రాశిపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు స్నేహితులతో కూడా మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక నష్టాలు తప్పవు. జాగ్రత్తగా మెలగాల్సిన సమయం. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు.
కుంభరాశి..
ఈ యోగం వల్ల కుంభ రాశి వారికి కూడా చర్మ సమస్యలు తప్పవు. ప్రతి పనిలో జాగ్రత్తగా వహించాలి. నిద్రలేమి సమస్యతో కూడా బాధపడతారు. ప్రధానంగా వీళ్లకు ఓపికతో ఉండకపోతే నష్టాలు తప్పవు. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అంతేకాదు కెరీర్ లో కూడా వీళ్ళకి పురోగతి ఉండదు.
మీన రాశి ..
ఈ యోగం వల్ల మీన రాశి వారికి కూడా భారీగా నష్టాలు తప్పవు. ప్రధానంగా వీళ్ళు లక్ష్యం వైపుగా అడుగు వేయకుండా ఉంటారు. గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఏ పని చేయాలన్నా కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి పనిలో అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)