Panchakam: రెండు రోజుల్లో ప్రమాదకరమైన అగ్నిపంచకం.. పొరపాటున ఈ పనులు చేయకూడదు
Panchakam: రెండు రోజుల్లో పంచకం వస్తుంది. మన హిందూ మతంలో ఇది అశుభం. ఈ సమయంలో మంగళకరమైన పనులు చేయకూడదు.

Panchakam: రెండు రోజుల్లో ప్రమాదకరమైన అగ్నిపంచకం.. పొరపాటున ఈ పనులు చేయకూడదు
Panchakam: రెండు రోజుల్లో పంచకం వస్తుంది. మన హిందూ మతంలో ఇది అశుభం. ఈ సమయంలో మంగళకరమైన పనులు చేయకూడదు. అయితే ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి పంచకం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 26 వరకు ఉంటుంది. పంచకం అనేది ఐదు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. సాధారణంగా పంచకం అంటే చంద్రుడు ధనిష్ట నక్షత్రం మూడవ దశను దాటి రేవతి, శతభిషా, పూర్వభద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా సంచరించడానికి పంచక కాలం అంటారు. ఈ సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు.
ఈ పంచకం సమయంలో ఇంటి పైకప్పును తొలగించడం వంటివి చేయకూడదు. మంచం మొదలైనటువంటివి తయారు చేయకూడదు. కొనుగోలు చేయకూడదు. ఇవన్నీ అశుభం. ఇంటికి ఎలాంటి చెక్క వస్తువులు తీసుకురాకూడదు. పంచక సమయంలో ప్రమాదకరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి ఈ పంచక సమయంలో మరణిస్తే మరో ఐదు మంది మరణించే ప్రమాదం ఉంది.
ఈ కాలంలో చనిపోవడం అశుభం. ఇది దుష్ప్రభావాన్ని ఇస్తుంది. అందుకే మృతదేహాన్ని ఖననం చేసేటప్పుడు కొన్ని ఆచారాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పంచక దోషం చుట్టకూడదని చేస్తారు. అయితే మంగళవారం ప్రారంభమయ్యే ఈ పంచకం సమయంలో భూమిని తవ్వడం, ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు చేయడం వంటివి పొరపాటున కూడా చేయకూడదు.