Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు మీ జన్మ సంఖ్య ప్రకారం ఇవి కొంటే.. అఖండ ఐశ్వర్య ప్రాప్తి
Akshaya Tritiya Things To Buy: అక్షయ తృతీయ ఎంతో శుభకరమైన రోజు. ఈ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు మీ జన్మ సంఖ్య ప్రకారం ఇవి కొంటే.. అఖండ ఐశ్వర్య ప్రాప్తి
హిందూమతంలో శుభప్రదమైన అక్షయ తృతీయ. ఈ ఏప్రిల్ 30వ తేదీ రానుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవి కుబేరుని పూజిస్తారు. ఈ రోజు సంఖ్య ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
అక్షయ తృతీయ శుభ ముహూర్తం ఏప్రిల్ 30 ఉదయం 6:10 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. ఈ సమయంలో బంగారం, వెండి లేదా ఇతర శుభకరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అయితే జన్మ సంఖ్యా ప్రకారం ఏ వస్తువులు కొనుగోలు చేయాలి తెలుసుకుందాం..
జన్మ సంఖ్య ప్రకారం కొనుగోలు చేయాల్సిన వస్తువులు..
రాడిక్స్ 1 వచ్చేవాళ్ళు అక్షయ తృతీయ రోజు బార్లీ కొనుగోలు చేయాలి.
రాడిక్స్ 2 వచ్చినవాళ్లు బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా బియ్యం కూడా కొనుగోలు చేయాలి.
రాడిక్స్ 3 వచ్చినవాళ్లు కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు కొనుగోలు చేస్తే మంచిది.
రాడిక్స్ 4 వచ్చేవారు కొబ్బరికాయ కొనడం మంచిది.
రాడిష్ 5 తులసి లేకపోతే ఏదైనా వెదురుతో తయారుచేసిన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది.
రాడిక్స్ 6 బియ్యం చక్కర వంటి తీపి పదార్థాలు కొనుగోలు చేయాలి.
రాడిక్స్ 7 వచ్చేవాళ్ళు అరటి పండ్లు దానం చేయడం శుభకరం.
రాడిక్స్ 8 వచ్చేవాళ్లు నువ్వులు కొనుగోలు చేయాలి. 9 వచ్చేవారు మట్టికుండలు కొనడం శుభప్రదం
ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీదేవి కుబేరుల పూజ చేస్తారు. ఇది ఎంతో శుభకరమైన రోజు. ప్రధానంగా బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇవి కొనుగోలు చేయలేని వారు ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయడం కూడా శుభకరం. ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఆన్‌లైన్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని ధృవీకరించడం కానీ లేదా బాధ్యత తీసుకోవడం కానీ జరగదు).