Vastu Tips: ఇంటి కిచెన్‌లో ఈ వస్తువు పెడుతున్నారా? అయితే దరిద్రం గ్యారెంటీ

Kitchen Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నట్లే కిచెన్ వాస్తు కూడా ఎంతో ముఖ్యం. కిచెన్‌లో పెట్టకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి.

Update: 2025-04-08 02:30 GMT
Vastu Tips

Vastu Tips: ఇంటి కిచెన్‌లో ఈ వస్తువు పెడుతున్నారా? అయితే దరిద్రం గ్యారెంటీ

  • whatsapp icon

Kitchen Vastu Tips: వాస్తు ప్రకారం కిచెన్‌లో కొన్ని వస్తువులు ఉండకూడదు. అక్కడ మనం భోజనం వండుకుంటాం. అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కిచెన్‌లో దీపం వెలిగించి పెట్టకపోవడం కూడా మన ఆనవాయితీ. అందుకే కిచెన్‌ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్టవ్‌ కూడా సరైన దిశలో ఉండాలి. ప్రధానంగా తూర్పు దిశలో నిలబడి వంట చేయాలి. దానికి నియమాలు ఉన్నాయి అయితే కిచెన్‌లో ఉండకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి.

ఉప్పు, మసాలాలు..

వంటగదిలో ఉప్పు, మసాలా డబ్బా మూత తెరిచి పెట్టకూడదు. తద్వారా ఇంట్లో వాస్తు దోషం పెరిగిపోతుంది. ఇవి ఎప్పటికీ మూత పెట్టి ఉంచాలి . దీనివల్ల ధన నష్టం వాటిల్లుతుంది. అంతేకాదు ఇంట్లో స్ట్రెస్ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెరిగిపోతాయి.

విరిగిన గిన్నెలు..

అంతేకాదు ఇంట్లో విరిగిన గిన్నెలు, కప్పులు, ప్లేట్లు పెట్టుకోకూడదు. ఇది నెగిటివిటీకి దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇలాంటి వస్తువులు ఉండటం అశుభం. ఇంట్లో ధన నష్టం వాటిల్లుతుంది.

డస్ట్ బిన్ ..

ఈ మధ్యకాలంలో చాలామంది వంటగదిలో కూడా ఒక డస్ట్ బిన్ పెట్టుకుంటున్నారు. అయితే ఇది వంట గ్యాస్‌కు దగ్గరలో ఉండకుండా ఉండాలి. ఇది ఇంట్లో ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. కిచెన్‌లో ఉండే డస్ట్ బిన్ ఆర్థిక సమస్యలను తీసుకువస్తుంది. ఏదో ఒక మూలలో ఏర్పాటు చేసుకోవాలి.

నీళ్లు, మంట..

అంతేకాదు వంటగదిలో నీళ్లు, వంట చేసే గ్యాస్ స్టవ్ పక్కపక్కనే ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సింకు పక్కనే స్టవ్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచిది కాదు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది. సింక్‌కు స్టవ్ కాస్త దూరం ఉండాలి.

పాడైన ఆహార పదార్థాలు..

ఇవి మాత్రమే కాదు వంటగదిలో ఎక్స్‌పైరీ అయిపోయి పాడై పోయిన ఆహార పదార్థాలను అలాగే వదిలేస్తారు. ఇది కూడా ఇంట్లో దురదృష్టానికి సంకేతం. నెగటివ్ ఎనర్జీని పెంచేస్తుంది. ఎప్పటికప్పుడు వంటగదిలో వంట గది షెల్ప్‌ శుభ్రం చేసుకోవాలి. తాజాగా ఆహార పదార్థాలతో ఫిల్ చేయాలి.

Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు.

Tags:    

Similar News