Shani Dev: 30 ఏళ్ల తర్వాత శని తిరోగమనం.. ఈ 3 రాశులు నక్కతోక తొక్కినంత అదృష్టం
Shani Dev Blessed Signs: గ్రహాల్లో శని దేవుడు సాధారణంగా మెల్లగా ప్రయాణిస్తాడు. అయితే ఏ రాశిలో ఉన్నా రెండున్నర ఏళ్ల పాటు ఉంటాడు. ఈ మూడు రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తున్నాడు.

Shani Dev: 30 ఏళ్ల తర్వాత శని తిరోగమనం.. ఈ 3 రాశులు నక్కతోక తొక్కినంత అదృష్టం
Shani Dev Blessed Signs: శని తిరోగమనంతో మూడు రాశులు లక్కు బాగా కలిసి వస్తుంది. శని ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులకు శుభాన్నిస్తే మరికొన్నిటికీ అశుభం కలుగుతుంది. అయితే శని కర్మలను బట్టి ఫలితాలు అందిస్తాడు. సౌర వ్యవస్థలో ప్రధానంగా శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. అయితే ఇది కాలానుగుణంగా ముందుకు వెనక్కు కదులుతూ కొన్ని రోజులపాటు మారుతూ ఉంటుంది. శని తిరోగమనం వల్ల మూడు రాశులకు బంపర్ లాభాలు కలుగుతాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా?
మకర రాశి..
శని తిరోగమనం వల్ల మకర రాశి వారికి అదృష్టం కలుగుతుంది. ప్రధానంగా వీళ్ళు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాదు కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. బాస్ కూడా మెచ్చుకునే అవకాశం ఉంది. శనితిరోగమనం వల్ల కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. ఆదాయ వనరులలో పెరుగుతాయి.
కర్కాటక రాశి..
శని తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాదు వీళ్ళకు పదోన్నతి వచ్చే సమయం. శని వల్ల ఈ రాశులకు అదృష్ట యోగం ఎందుకంటే ఇందులో తొమ్మిదో ఇంట్లో శని దేవుడు సంచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరికి దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అన్ని అనుకూలంగా కలిసి వస్తాయి.
కుంభరాశి..
శని తిరోగమనం వల్ల నిరుద్యోగులకు శుభ సమయం అని చెప్పాలి. కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి అంతేకాదు వీళ్ళకి వ్యాపారాలు కూడా విస్తరించే సమయం. ఇది కాకుండా వృషభ రాశి వారికి కూడా అశేష యోగాలు కలుగుతాయి. వీళ్ళకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. శని కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు.ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి కూడా విశిష్ట యోగం కలుగుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు.)