Gajakesari Rajayogam: ఏప్రిల్ నెలలో ఈ రాశికి గజకేసరి రాజయోగం.. పదోన్నతి, పట్టిందల్లా బంగారం

Gajakesari Rajayogam Lucky Zodiac Signs: గ్రహాల కదలికల ప్రభావం కచ్చితంగా ద్వాదశ రాశులపై పడుతుంది. గురుడు, చంద్రుడు కలిసి యోగం ఏర్పడితే గజ కేసరి యోగం అవుతుంది.

Update: 2025-04-02 01:00 GMT

Gajakesari Rajayogam: ఏప్రిల్ నెలలో ఈ రాశికి గజకేసరి రాజయోగం.. పదోన్నతి, పట్టిందల్లా బంగారం

Gajakesari Rajayogam Lucky Zodiac Signs: గజకేసరి రాజయోగం వేద శాస్త్రంలో దీనివల్ల రాశులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ యోగం వల్ల జీతం, పదోన్నతి కూడా ఖాయం. సాదరణంగా గజకేసరి యోగం అంటే చంద్రుడు, గురుడు కలిసి యోగాన్ని ఏర్పరిస్తే దాన్ని గజకేసరి రాజయోగం అంటారు. ఏప్రిల్ 1 నుంచి ఈ యోగం ఏర్పడుతుంది. ఈ రెండు కలిసి వృషభ రాశిలోకి వెళ్తున్నాయి. తద్వారా ఇది గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి.

ఈ గజకేసరి రాజయోగం వల్ల మూడు రాశులకు లక్కీ సమయమని చెప్పాలి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే ఈ మూడు రాశులు నక్క తోక తొక్కినట్లే అని అర్థం..

వృషభ రాశి..

గజకేసరి రాజయోగం వల్ల వృషభ రాశి వారికి లక్కీ సమయం అని చెప్పాలి. ఈ రాశిలోనే గురుడు, చంద్రుడు కలుస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి నక్క తోక తొక్కినట్లే అని చెప్పాలి. ప్రధానంగా వీళ్లకు పదోన్నతి ఖాయం. ఉద్యోగంలో మార్పు అయినా కానీ కచ్చితంగా జీతం కూడా పెరిగే యోగం ఉంది. గురు అనుగ్రహంతో ప్రతి రంగంలో వీళ్ళు విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి వ్యాపారంలో కూడా భారీ లాభాలు వస్తాయి. ప్రధానంగా వివాహం కాని వారికి వివాహయోగం కూడా ఉంది.

మిథున రాశి..

గజకేసరి రాజయోగం వల్ల మిథున రాశి వారికి కూడా కెరీర్లో విశేష యోగం కలుగుతుంది. ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుపుచ్చుకుంటారు. వీళ్ళకి ఉద్యోగంలో పదోన్నతి ఖాయం. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. గజకేసరి రాజయోగం వల్ల వీరికి లక్ష్మీ యోగం ఆశీర్వాదాలు లభిస్తాయి. ప్రధానంగా కుటుంబంతో సఖ్యత పెరుగుతుంది. దీంతో లాంగ్‌ ట్రిప్పులకు కూడా వెళ్లే సూచనలు ఉన్నాయి.

మీన రాశి..

మీన రాశి వారు కూడా గజకేసరి రాజయోగం వల్ల విశేష రాజయోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అనుకోవచ్చు. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా వీరికి కలుగుతుంది. అంతేకాదు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. మీనరాశి వారికి గజకేసరి రాజయోగం ఒక గొప్ప వరం అని చెప్పాలి.

Tags:    

Similar News