Tortoile Ring: అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే.. ఈ వేలికి తాబేలు ఉంగరం ధరించండి
Tortile Ring Benefits: తాబేలు ఉంగరం ధరించడం చాలా మంది వేళ్లకు చూసే ఉంటాం. దీంతో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Tortoile Ring: అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే.. ఈ వేలికి తాబేలు ఉంగరం ధరించండి
Tortile Ring Benefits: తాబేలు ఉంగరం ధరించడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా అప్పుల బాధలు తొలగిపోతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే వెండి తాబేలు ఉంగరం చాలామంది వేళ్ళకు ధరించి ఉండటం గమనిస్తాం. అయితే రాశి చక్రాల ప్రకారం ఇందులో రత్నాలను ఉపయోగించి వేళ్ళకు దరిస్తారు. అయితే తాబేలు ఉంగరం ఏ వేలికి ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకుందాం
తాబేలు ఉంగరం రాశి చక్రాల ప్రకారం సరైన రీతిలో ధరించాలి. తద్వారా ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. లేకపోతే నెగిటివ్ ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు పెంచుతుంది. వాస్తు ప్రకారం మన చేతికి తాబేలు ఉంగరం ధరిస్తే వాస్తు నిపుణుల సలహా కూడా తీసుకోండి. తద్వారా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.
ప్రధానంగా వెండితో తయారుచేసిన తాబేలు ఉంగరం ఎక్కువమంది ధరిస్తూ ఉంటారు. ఇది శుభ ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే వెండి అంటేనే శుభం అయితే ఎడమ చేతి వేళ్లకు మాత్రమే పొరపాటున తాబేలు ఉంగరం ధరించకూడదు. ఇలా చేయడం వల్ల మీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కుడి చేతి వేళ్లకు మాత్రమే ఈ తాబేలు ఉంగరాన్ని ధరించాలి. ఫెంగ్ షుయ్ ప్రకారం చూపుడు వేలు లేదా మధ్య వేలుకు మాత్రమే తాబేలు ఉంగరాన్ని ధరించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పుల ఊబి నుంచి బయటపడతారు.
అంతేకాదు వెండి తాబేలు ఉంగరం ధరించడం వల్ల అశేష ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా శుక్రవారం నాడు లక్ష్మి పూజ చేసి తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల అశేష ఫలితాలు లభిస్తాయి. అయితే మీ ఉంగరం ఎప్పటికీ ఎవరితోనో షేర్ చేసుకోకూడదు. అలా ఇతరుల ఉంగరం ధరించకూడదు. ఇది శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.