Baba Vanga: వామ్మో.. బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం వింటే కాళ్లు, చేతులు వణకాల్సిందే!
Baba Vanga: బాబా వంగా కొత్తగా చేసిన హెచ్చరిక ఎవరూ ఊహించని అంశంపై ఉంది. అదే స్మార్ట్‌ఫోన్‌ల వాడకం. అధికంగా ఫోన్లు వాడడం వల్ల మన ఆరోగ్యం, భావోద్వేగాలు, సంబంధాలు అన్నీ ప్రమాదంలో పడతాయని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. టెక్నాలజీ అవసరమే కానీ ఆవశ్యకత మించకుండా వాడటం మన బాధ్యత.

Baba Vanga: వామ్మో.. బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం వింటే కాళ్లు, చేతులు వణకాల్సిందే!
Baba Vanga: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భవిష్యత్తు సంఘటనలను ముందే ఊహించిన బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా... ఇప్పుడు మరోసారి సంచలనంగా మారిపోయింది. ఈసారి ఆమె ఊహించిన విషయం యుద్ధం, వరదలు, భూకంపాలు, మహమ్మారుల గురించి కాదు. అందరినీ వణికించేలా ఆమె చేసిన తాజా హెచ్చరిక మనందరికీ తెలిసిన వస్తువు గురించి ఉంది... అదే స్మార్ట్‌ఫోన్.
తలపోటుగా మారిన ఫోన్లు:
బాబా వంగా చేసిన ఓ భవిష్యవాణి ప్రకారం.. మానవులు స్మార్ట్‌ఫోన్ల మీద బాగా ఆధారపడటం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. మన సంబంధాలు, భావోద్వేగాలు అన్నీ ఫోన్ల వల్ల దెబ్బతింటాయని ఆమె హెచ్చరించింది. మరింతగా ఫోన్లకు జోడైపోతూ, నిజమైన అనుభూతులను మర్చిపోతారని చెప్పింది. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లకు, స్క్రీన్‌కు అతుక్కుపోయి మానవులు యంత్రాల్లా మారే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడింది.
అతిమిత స్క్రీన్ టైమ్:
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకుండా రోజును ఊహించలేనంతగా మన జీవితాల్లో స్థిరపడిపోయింది. అయితే దీని వాడకం నియంత్రించుకోవడం చాలా మందికి కష్టంగా మారింది. ముఖ్యంగా యువతలో ఎక్కువగా స్క్రీన్ టైమ్ వల్ల నిద్రలేమి, ఒత్తిడి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చూసే ఆకర్షణీయమైన జీవితాలు తమను తక్కువగా భావించేలా చేస్తూ మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.
బ్లూ లైట్ ప్రభావం:
ఫోన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు తీవ్రంగా భంగం కలిగిస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. మరింతగా ఫోన్ల మీద ఆధారపడటం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇది చివరికి మానవులలో భావోద్వేగాలను కూడా తగ్గించే స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని బాబా వంగా చెబుతోంది.
డిజిటల్ డిటాక్స్ అవసరం:
ఇలాంటి పరిస్థితుల్లో 'డిజిటల్ డిటాక్స్' అనే మాట ఇప్పుడు ఎక్కువ వినిపిస్తోంది. అంటే టెక్నాలజీని అవసరమైనప్పుడే వాడటం, కంట్రోల్ చేయటం. ఫోన్లను తరచూ పక్కన పెట్టి నిజమైన జీవితాన్ని ఆస్వాదించాలనే అవగాహన పెరుగుతోంది. బాబా వంగా చేసిన హెచ్చరిక ఈ మార్పుకు తార్కాణంగా మారుతుందేమో చూడాలి.