Akshaya Tritiya 2025: పితృ దోషంతో బాధపడుతున్నారా? అక్షయ తృతీయ రోజు ఈ చిన్న వస్తువు దానం చేయండి చాలు

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ అనగానే లక్ష్మీదేవిని పూజిస్తారు అని గుర్తుకొస్తుంది. అంతేకాదు ఆరోజు బంగారం కొనడానికి కూడా శుభ దినం. అయితే అక్ష‌య తృతీయ రోజు దానం చేస్తే కూడా మంచిది.

Update: 2025-04-16 02:30 GMT
Akshaya Tritiya 2025

Akshaya Tritiya: పితృ దోషంతో బాధపడుతున్నారా? అక్షయ తృతీయ రోజు ఈ చిన్న వస్తువు దానం చేయండి చాలు

  • whatsapp icon

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన రానుంది. హిందువులు జరుపుకునే పరమ పవిత్రమైన పండుగ. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. వైశాఖమాసంలో శుక్లపక్ష తృతీయనాడు అక్షయ తృతీయ ప్రతి ఏడాది జరుపుకుంటారు. ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా కొన్ని పరిహారాలు చేయడం వల్ల పితృ దోషం నుంచి కూడా బయటపడతారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

ప్రధానంగా అక్షయ తృతీయ రోజు గంగ స్నానం చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. పితృ దోషం నుంచి కూడా బయటపడతారు. అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల పితృ దోషం నుంచి విముక్తి కలుగుతుంది. ప్రధానంగా నీటి కుండను దానం చేస్తే పితృ దోషం నుంచి బయటపడతారు. రాగి లేదా ఇత్త‌డి కుండను కూడా దానం చేయవచ్చు. దీంతోపాటు బెల్లం కూడా దానం చేయవచ్చు. మీ స్తోమ‌త‌కు త‌గిన విధంగా ఈ దానాలు చేయాలి.

అక్షయ తృతీయ రోజు గోధుమలు, బియ్యం, బార్లీ, పెసర్లు వంటివి కూడా దానం చేయవచ్చు. అయితే అపాత్ర దానం చేయకుండా కేవలం అవసరమైన వారికి మాత్రమే ఈ దానం చేయాలి. తద్వారా పితృ దోషం నుంచి బయటపడతారు. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది.

ఇది మాత్ర‌మే కాదు అక్షయ తృతీయ రోజు బెల్లం, పండ్లు వంటివి కూడా దానం చేయాలి. తద్వారా పూర్వీకులు ఆశీర్వాదాలు పొందుతారు. ఈరోజు నోరులేని జంతువులకు ఆహారం పెట్టడం వల్ల కూడా మీకు ధన వర్షం కురుస్తుంది. అక్షయ తృతీయ రోజు గొడుగు, చెప్పులను దానం చేస్తే కూడా పూర్వీకులు సంతోషపడతారు. తద్వారా మీరు పితృదోషాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది.

Tags:    

Similar News